“కేసీఆర్‌ను మోసం చేసి పార్టీ మారడం ఇష్టం లేదు.. అభివృద్ధి కోసం తప్పలేదు”

🔴 బిగ్ బ్రేకింగ్ న్యూస్

🚨 అనవసరంగా కాంగ్రెస్ పార్టీలో చేరాను అంటూ పోచారం శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
సీఎం రేవంత్ రెడ్డిపై అసంతృప్తి.. మంత్రులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు..

“అనవసరంగా కాంగ్రెస్ పార్టీలో చేరాను!”

మరోసారి రేవంత్ రెడ్డిపై ఫిరాయింపు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తిరుగుబాటు స్వరం

బాన్సువాడ:
తెలంగాణ రాజకీయాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యే, బాన్సువాడ ఎమ్మెల్యే
పోచారం శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో చేరడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, కొన్ని రాజకీయ
పరిణామాల కారణంగానే పార్టీ మారాల్సి వచ్చిందని పేర్కొన్నారు.

“కేసీఆర్‌ను మోసం చేసి పార్టీ మారడం నాకు ఇష్టం లేదు.. కానీ కొన్ని
రాజకీయ పరిణామాల వల్ల పార్టీ మారాల్సి వచ్చింది”

కేసీఆర్ వల్లే అభివృద్ధి జరిగింది


పోచారం శ్రీనివాస్ రెడ్డి

తన నియోజకవర్గంలో అభివృద్ధి జరగడానికి కేసీఆర్ కారణమని తానే
చెబుతున్నానని పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తనకు అన్నం పెట్టిన
వ్యక్తిని మరచిపోవడం కష్టంగా ఉందని వ్యాఖ్యానించారు.

నిధులు ఇస్తామని సీఎం చెబితేనే పార్టీలో చేరాను

బాన్సువాడ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను ఆరు నెలల్లో
పరిష్కరిస్తామని, నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులు
ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిన తరువాతే తాను
కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు పోచారం తెలిపారు.

అయితే తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి
స్వయంగా భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలకు చెప్పినా
వారు పట్టించుకోవడం లేదని పోచారం ఆరోపించారు.

“ముఖ్యమంత్రి మాటలను మంత్రులు లెక్క చేయడం లేదు”

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలను మంత్రులు లెక్క చేయడం లేదని
పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. మంత్రులకు ఎన్నిసార్లు
ఫోన్ చేసినా వారు స్పందించడం లేదని అన్నారు.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, భట్టి విక్రమార్క సీఎం మాట వినడం
లేదని ఆయన ఆరోపించారు. మంత్రులు పట్టించుకోవడం లేదని, అయినా
నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి స్వయంగా వేం నరేందర్ రెడ్డికి
చెప్పినా ఆయన కూడా పట్టించుకోలేదని పేర్కొన్నారు.

“వేం నరేందర్ రెడ్డికి 50 సార్లు ఫోన్ చేసినా ఫోన్ అటెండ్ చేయలేదు”

“నేను జాతీయ జెండానే కప్పుకున్నాను.. కాంగ్రెస్ జెండా కాదు”

కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో తాను కాంగ్రెస్ జెండాను కాకుండా
జాతీయ జెండాను మాత్రమే కప్పుకున్నానని పోచారం శ్రీనివాస్ రెడ్డి
పేర్కొన్నారు.

“నేను నీకు అమ్ముడుపోయానా.. నా ఎమ్మెల్యే పదవిని కొన్నావా?”

గత నవంబర్‌లో ఫిరాయింపు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
సమావేశం నిర్వహించిన సమయంలో తాను సీఎంను నేరుగా ప్రశ్నించానని
పోచారం తెలిపారు.

“నేను నీకు అమ్ముడుపోయానా? నా ఎమ్మెల్యే పదవిని కొన్నావా?”

అంటూ రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నించినట్లు పోచారం శ్రీనివాస్ రెడ్డి
వెల్లడించారు.

పవార్ వార్తా సూత్ర:
పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వర్గాల్లో
చర్చకు దారితీశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *