PM-SETU ITI క్లస్టర్‌తో పెద్దపల్లికి నైపుణ్యాభివృద్ధి కేంద్రం

పెద్దపల్లిలో PM-SETU ITI క్లస్టర్ ఏర్పాటు చేయాలి

కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామికి మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణ విజ్ఞప్తి

న్యూఢిల్లీ:
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో
PM-SETU ITI క్లస్టర్ ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర
కార్మిక, ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి,
పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి
హెచ్.డి. కుమారస్వామిని కోరారు.

ఈ మేరకు న్యూఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి పెద్దపల్లి ప్రాంతానికి
PM-SETU ITI క్లస్టర్ అవసరాన్ని వివరించారు. తెలంగాణ రాష్ట్రం
PM-SETU కార్యక్రమంలో అగ్రగామిగా ఉన్న నేపథ్యంలో, పెద్దపల్లి
పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఒక PM-SETU ITI క్లస్టర్‌ను
NMDC ద్వారా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా శిక్షణ

పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పారిశ్రామిక, మైనింగ్ బెల్ట్‌గా
ఉన్నందున ఈ ప్రాంత యువతకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య
శిక్షణ అందించాల్సిన అవసరం ఉందని మంత్రి వివేక్ వెంకటస్వామి,
ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్ర మంత్రికి వివరించారు.

ప్రత్యేకంగా మైనింగ్, మెటల్స్, ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్,
మెకానికల్
తదితర రంగాల్లో ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను
అందించేలా ITI క్లస్టర్‌ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని వారు
పేర్కొన్నారు.

PM-SETU ITI క్లస్టర్ ఏర్పాటు ద్వారా పెద్దపల్లి పార్లమెంట్
నియోజకవర్గంలోని యువతకు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్య శిక్షణ
అందడంతో పాటు, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుందని
వారు కేంద్ర మంత్రికి వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *