డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ లేని పిల్లలకు ఆధార్ అవకాశం
డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ అందుబాటులో లేని పిల్లలకు ఆధార్ కార్డు కోసం
దరఖాస్తు చేసుకునేందుకు డొమిసైల్ సర్టిఫికెట్ ఆధారంగా అవకాశం పొందవచ్చని సమాచారం.
ముందుగా చేయాల్సినవి
ఆధార్ కోసం దరఖాస్తు చేసుకునే ముందు తల్లి లేదా తండ్రి ఆధార్ కార్డులోని
చిరునామా సంబంధిత గ్రామానికి చెందినదిగా ఉండాలి.
అనంతరం డొమిసైల్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేసి,
సంబంధిత గ్రామ VRO (వీఆర్వో) ద్వారా ధృవీకరించించాలి.
అనంతరం సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో
దరఖాస్తును సమర్పించాలి.
ఆధార్ కేంద్రంలో దరఖాస్తు
తహసీల్దార్ ధృవీకరించిన డొమిసైల్ సర్టిఫికెట్‌తో పాటు
తల్లి లేదా తండ్రి ఆధార్ కార్డు జిరాక్స్ కాపీని
తీసుకుని సమీప ఆధార్ కేంద్రానికి వెళ్లి ఆధార్ కార్డు కోసం
దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆధార్ నమోదు సమయంలో అవసరమైన పత్రాలు, అర్హతలు మరియు ప్రస్తుత UIDAI
నిబంధనలను సంబంధిత ఆధార్ కేంద్రం లేదా అధికారుల వద్ద తప్పనిసరిగా
నిర్ధారించుకోవాలి.