గోవిందరావుపేటలో బీఆర్ఎస్ భారీ నిరసన.. రైతు సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు

ములుగు జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు ముఖ్య అతిథిగా హాజరై కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. గోవిందరావుపేట ప్రాంతంలో సాగునీరు అందక పంట పొలాలు ఎండిపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. స్థానిక మంత్రి సీతక్క ప్రాంతంలో పర్యటిస్తున్నప్పటికీ రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

దేవాదుల పంపులపై బీఆర్ఎస్ విమర్శలు

ఉమ్మడి వరంగల్ జిల్లాకు కీలకమైన దేవాదుల ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని లక్ష్మణ్ బాబు ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ అదనంగా ఆరు పంపులు ఏర్పాటు చేసి సాగునీటి సామర్థ్యాన్ని పెంచారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న పంపులను కూడా ప్రభుత్వం సక్రమంగా నడపలేకపోతోందని విమర్శించారు.

బీఆర్ఎస్ నాయకులు హరీశ్ రావు, కేటీఆర్ ఒత్తిడి తెచ్చిన తర్వాతే పంపులను ఆన్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

లక్నవరం కెనాల్ పనులపై ప్రశ్నలు

లక్నవరం కెనాల్ పనుల విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్మణ్ బాబు ప్రశ్నించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కెనాల్ తవ్వకాలకు చర్యలు చేపట్టిన సమయంలో సీతక్క రైతులను రెచ్చగొట్టి పనులను అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతున్నప్పటికీ కనీసం 3–4 కిలోమీటర్ల కెనాల్ పనులను కూడా ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. కెనాల్ పూర్తయి ఉంటే లక్నవరం జలాలతో మరిన్ని ప్రాంతాలకు సాగునీరు అందేదని అన్నారు. వానాకాలంలోనే పరిస్థితి ఇలా ఉంటే రాబోయే యాసంగిలో రైతుల పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తం చేశారు.

రుణమాఫీ, రైతుబంధుపై ఆరోపణలు

రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేదని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. రైతుబంధు విషయంలోనూ రైతులకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.

కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు పథకాన్ని రూ.15 వేల వరకు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, అయితే చెప్పిన విధంగా నిధులు అందడం లేదని లక్ష్మణ్ బాబు పేర్కొన్నారు.

యూరియా కోసం రైతుల ఇబ్బందులు

యూరియా కోసం రైతులు తెల్లవారుజామునే సొసైటీల వద్ద క్యూలలో నిలబడాల్సి వస్తోందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. గతంలో సులభంగా లభించిన యూరియా కోసం ప్రస్తుతం రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ప్రభుత్వం చెల్లించే ట్రాన్స్‌పోర్ట్, లోడింగ్ ఛార్జీలను నిలిపివేయడం ద్వారా సొసైటీలపై అదనపు భారం పడుతోందని ఆరోపించారు.

కాళేశ్వరం ప్రాజెక్టును గతంలో విమర్శించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రస్తుతం రైతులకు సాగునీరు అందించడంలో విఫలమైందని లక్ష్మణ్ బాబు విమర్శించారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.

ఈ నిరసన కార్యక్రమంలో పోరిక గోవింద్ నాయక్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, కాకులమర్రి ప్రదీప్ రావు, గోవిందరావుపేట మండల అధ్యక్షుడు లక్క వత్తు నరసింహ, తాటి కృష్ణ, మాజీ ఎంపీటీసీ చందులాల్, మోహన్ రాథోడ్, స్వరూప, రామ్, చంద్రు తదితరులు పాల్గొన్నారు.

అలాగే సర్పంచులు సీతారామ నాయక్, గాంధీ, రాకేష్, ఎండి వలీ బాబా, ఎండి ఖాజా పాషా, తాడూరి రఘు, కర్ర రవీందర్, ఎలవర్తి శ్రీనివాస్, కుమ్మరి చంద్రబాబు, జాడి బోజరావు, వావిలాల పోశయ్య, కటుకూరి రాఖి, బాస శరత్‌తో పాటు వివిధ గ్రామాల రైతులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Share this News / ఈ వార్తను షేర్ చేయండి

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
🕉️ పవార్ వార్త ప్రత్యేక వ్యాపార ప్రకటన
🕉️ PAWAR VARTHA SPECIAL BUSINESS ADVERTISEMENT
🪔 ఎల్లారెడ్డి నాణ్యత నమ్మకం

శ్రీ మణికంఠ పూజా సామాగ్రి

అయ్యప్ప పూజా సామాగ్రి సంపూర్ణంగా లభించు స్థలం

🕉️ అన్ని రకాల మాలధారణ సామాగ్రి
🪔 అయ్యప్ప పూజా సామాగ్రి
🌺 సత్యనారాయణ స్వామి వ్రత సామాగ్రి
🙏 లక్ష్మీ వ్రత సామాగ్రి
🔥 అగరబత్తులు, లోబాన్
🌼 పసుపు, కుంకుమ
హారతి కర్పూరం
🪔 అన్ని రకాల పూజా వస్తువులు
✨ నాణ్యత 🙏 భక్తి సేవ 💰 సరసమైన ధరలు
🙏
పంతులు రామేశ్వర్రావు శ్రీ మణికంఠ పూజా సామాగ్రి
🪔 Ellareddy Quality Trust

Sri Manikanta Pooja Samagri

Complete destination for Ayyappa pooja essentials

🕉️ All Ayyappa Mala Dharana items
🪔 Ayyappa Pooja Samagri
🌺 Satyanarayana Swamy Vratham items
🙏 Lakshmi Vratham items
🔥 Agarbatti and Loban
🌼 Turmeric and Kumkum
Harathi Camphor
🪔 All types of Pooja items
✨ Quality 🙏 Devotional Service 💰 Reasonable Prices
🙏
Panthulu Rameshwar Rao Sri Manikanta Pooja Samagri
శ్రీ మణికంఠ పూజా సామాగ్రి ఎల్లారెడ్డి
🪔 పూజా సామాగ్రి
🪔 POOJA COLLECTION
📍 శ్రీ మణికంఠ పూజా సామాగ్రి – ఎల్లారెడ్డి అయ్యప్ప భక్తులకు కావాల్సిన సంపూర్ణ పూజా సామాగ్రి 📞 94924 20341    |    ☎️ 08465-228555
📍 Sri Manikanta Pooja Samagri – Ellareddy Complete pooja essentials for Ayyappa devotees 📞 94924 20341    |    ☎️ 08465-228555
Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • వార్తా రచయిత ఈ రచయిత ప్రచురించిన ఇతర వార్తలను చూడండి.

Leave a Reply