1000 రోజుల కాంగ్రెస్ పాలనకు ప్రజల హర్షం.. సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం
బైక్ ర్యాలీలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్
మల్కాజ్‌గిరి కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని బోడుప్పల్, చెంగిచర్ల డివిజన్ల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనను పురస్కరించుకుని గురువారం ఘనంగా బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకం చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నాయకులు తెలిపారు.
ఈ బైక్ ర్యాలీలో మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మేడ్చల్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొని కార్యక్రమాన్ని ఉత్సాహపరిచారు.
తోటకూర వజ్రెష్ యాదవ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ సంక్షేమం, అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ తోటకూర అజయ యాదవ్, మాజీ కార్పొరేషన్ అధ్యక్షులు పోగుల నర్సింహ రెడ్డి, బోడుప్పల్ డివిజన్ అధ్యక్షులు బొమ్మకు కళ్యాణ్, చెంగిచర్ల డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోగుల దిలీప్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.