ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ సాయిలు పటేల్
📰 గ్రామీణ వార్తలు

🙏 ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సర్పంచ్ సాయిలు పటేల్

వెల్లుట్ల గ్రామంలో నిరుపేద కుటుంబానికి నెలకు రూ.2,000 చొప్పున సొంత కష్టార్జితం నుంచి ఆర్థిక సాయం అందిస్తున్న గ్రామ సర్పంచ్

వెల్లుట్ల గ్రామంలో గ్రామ సర్పంచ్ ఎన్నికల సమయంలో సర్పంచ్‌గా గెలిస్తే నిరుపేద కుటుంబానికి అండగా నిలుస్తానని ఇచ్చిన మాటను గ్రామ సర్పంచ్ సాయిలు పటేల్ నిలబెట్టుకున్నారు.

గ్రామానికి చెందిన నిరుపేద మంగలి రమేష్ కుటుంబ పరిస్థితిని చూసి సాయిలు పటేల్ ఆర్థికంగా అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. రమేష్ భార్య ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందడంతో, కుటుంబంపై తీవ్ర ఆర్థిక భారం పడింది. ఈ కుటుంబానికి నాలుగు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు.

ప్రభుత్వం నుంచి పింఛన్ వచ్చే వరకు తన సొంత కష్టార్జితం నుంచి ప్రతి నెలా రూ.2,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తానని సర్పంచ్ సాయిలు పటేల్ హామీ ఇచ్చారు.

ఇచ్చిన మాట ప్రకారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దల సమక్షంలో ఈ నెలకు సంబంధించిన రూ.2,000 ఆర్థిక సాయాన్ని కుటుంబానికి అందజేశారు.

ప్రతి నెల ఆర్థిక సాయం ₹2,000
9 నెలల్లో అందించిన మొత్తం ₹18,000

గత 9 నెలలుగా ప్రతి నెలా రూ.2,000 చొప్పున ఇప్పటివరకు మొత్తం రూ.18,000 ఆర్థిక సాయం అందించినట్లు సర్పంచ్ తెలిపారు. నిరుపేద కుటుంబానికి తన వంతు సహాయం అందిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

🙏 ఇట్లు,
మీ గ్రామ సర్పంచ్
సాయిలు పటేల్ – వెల్లుట్ల