స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: నాగారం మాజీ చైర్మన్ చంద్రారెడ్డి

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి

నాగారం మాజీ చైర్మన్ చంద్రారెడ్డి

నాగారం, ఆగస్టు 12 | తెలంగాణ పవార్ దినపత్రిక:

ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశభక్తి భావాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లేలా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

ఈ పిలుపు మేరకు నాగారం మాజీ చైర్మన్ చంద్రారెడ్డి నాగారం యోగ సెంటర్‌లో జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగస్వాములై, తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని ఆయన కోరారు.

దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకుంటూ, జాతీయ జెండాకు గౌరవం ఇవ్వడం ప్రతి భారతీయుడి బాధ్యత అని చంద్రారెడ్డి పేర్కొన్నారు.

“ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి స్వాతంత్ర్య దినోత్సవ స్ఫూర్తిని చాటాలి.”

— తెలంగాణ పవార్ దినపత్రిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *