శ్రీ సరస్వతి శిశు మందిర్‌కు 1000 సంచుల సిమెంట్ బహుకరణ
లింగంపేటలో నిర్మాణంలో ఉన్న పాఠశాల భవనాన్ని పరిశీలించిన డాక్టర్ పైడిల్లారెడ్డి
డాక్టర్ పైడిల్లారెడ్డి సేవా కార్యక్రమం
శ్రీ సరస్వతి శిశుమందిర్ ప్రబంధ కారిని సభ్యుల పిలుపు మేరకు నిర్మాణంలో ఉన్న పాఠశాల భవనాన్ని పరిశీలించిన డాక్టర్ పైడిల్లారెడ్డి, నిర్మాణానికి తనవంతు సహాయంగా 1000 సంచుల సిమెంట్‌ను బహుకరిస్తానని తెలిపారు.
లింగంపేట: శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల భవన నిర్మాణానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పైడిల్లారెడ్డి అండగా నిలిచారు.
శ్రీ సరస్వతి శిశుమందిర్ ప్రబంధ కారిని సభ్యుల పిలుపు మేరకు నిర్మాణంలో ఉన్నటువంటి శ్రీ సరస్వతి శిశు మందిర్ భవనాన్ని ఆయన పరిశీలించారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న పైడిల్లారెడ్డి వెంట అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు , బీజేపీ జిల్లా అధ్యక్షులు నీలం చిన్నరాజులు , బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు తదితరులు ఉన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు
జపాన్‌లో ఉద్యోగరీత్యా స్థిరపడ్డప్పటికీ తన పుట్టిన నియోజకవర్గానికి ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో అభివృద్ధిలో భాగంగా ఈ విధంగా ఆర్థిక సహాయం అందించడం గొప్ప విషయమని నాయకులు ఈ సందర్భంగా కొనియాడారు.
- హైమా రెడ్డి
- బొల్లారం క్రాంతి కుమార్
- జక్సాని దత్తు రాములు
- పెద్ది సంగీత
- రజనీకాంత్
- అంద్యాల ఉదష్
- మార్గం సుభాష్
- గొల్ల సాయిలు
- దురిశెట్టి రవి
- నరేష్ భగవాన్
- చేపూరి పోశెట్టి
- దాసరి అనిల్ కుమార్
- బొల్లు గణేష్
- కత్తూరి కిషన్
- శివరాత్రి నారాయణ
- దాసరి సాయిలు
- రాకేష్
- శిశు మందిర్ ప్రబంధ కారిని బృందం
- శిశు మందిర్ అధ్యాపకులు
- తదితరులు