లింగంపేట శ్రీ సరస్వతి శిశు మందిర్‌కు 1000 సంచుల సిమెంట్ బహుకరణ
ప్రత్యేక వార్త లింగంపేట
పాఠశాల అభివృద్ధికి సేవా కార్యక్రమం

శ్రీ సరస్వతి శిశు మందిర్‌కు 1000 సంచుల సిమెంట్ బహుకరణ

లింగంపేటలో నిర్మాణంలో ఉన్న పాఠశాల భవనాన్ని పరిశీలించిన డాక్టర్ పైడిల్లారెడ్డి

1000 సిమెంట్ సంచులు
పాఠశాల భవన నిర్మాణానికి పెద్ద చేయూత
నిర్మాణంలో ఉన్న శ్రీ సరస్వతి శిశు మందిర్‌కు 1000 సంచుల సిమెంట్ బహుకరణకు హామీ
1000 సంచుల సిమెంట్

డాక్టర్ పైడిల్లారెడ్డి సేవా కార్యక్రమం

శ్రీ సరస్వతి శిశుమందిర్ ప్రబంధ కారిని సభ్యుల పిలుపు మేరకు నిర్మాణంలో ఉన్న పాఠశాల భవనాన్ని పరిశీలించిన డాక్టర్ పైడిల్లారెడ్డి, నిర్మాణానికి తనవంతు సహాయంగా 1000 సంచుల సిమెంట్‌ను బహుకరిస్తానని తెలిపారు.

లింగంపేట: శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల భవన నిర్మాణానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పైడిల్లారెడ్డి అండగా నిలిచారు.

శ్రీ సరస్వతి శిశుమందిర్ ప్రబంధ కారిని సభ్యుల పిలుపు మేరకు నిర్మాణంలో ఉన్నటువంటి శ్రీ సరస్వతి శిశు మందిర్ భవనాన్ని ఆయన పరిశీలించారు.

పాఠశాల భవన నిర్మాణానికి తనవంతు సహాయంగా 1000 సంచుల సిమెంట్‌ను బహుకరిస్తానని డాక్టర్ పైడిల్లారెడ్డి తెలిపారు.

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న పైడిల్లారెడ్డి వెంట అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు , బీజేపీ జిల్లా అధ్యక్షులు నీలం చిన్నరాజులు , బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ రావు తదితరులు ఉన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు

డాక్టర్ పైడిల్లారెడ్డి
గువ్వల బాలరాజు
నీలం చిన్నరాజులు
రవీందర్ రావు

జపాన్‌లో ఉద్యోగరీత్యా స్థిరపడ్డప్పటికీ తన పుట్టిన నియోజకవర్గానికి ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో అభివృద్ధిలో భాగంగా ఈ విధంగా ఆర్థిక సహాయం అందించడం గొప్ప విషయమని నాయకులు ఈ సందర్భంగా కొనియాడారు.

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా నివాళులు
అనంతరం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా లింగంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
కార్యక్రమంలో పాల్గొన్న వారు
  • హైమా రెడ్డి
  • బొల్లారం క్రాంతి కుమార్
  • జక్సాని దత్తు రాములు
  • పెద్ది సంగీత
  • రజనీకాంత్
  • అంద్యాల ఉదష్
  • మార్గం సుభాష్
  • గొల్ల సాయిలు
  • దురిశెట్టి రవి
  • నరేష్ భగవాన్
  • చేపూరి పోశెట్టి
  • దాసరి అనిల్ కుమార్
  • బొల్లు గణేష్
  • కత్తూరి కిషన్
  • శివరాత్రి నారాయణ
  • దాసరి సాయిలు
  • రాకేష్
  • శిశు మందిర్ ప్రబంధ కారిని బృందం
  • శిశు మందిర్ అధ్యాపకులు
  • తదితరులు
పవర్ వార్త
ప్రజల గొంతుకే మా కలం… సత్యమే మా బలం
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply