హెచ్ఐవీ నివారణ అందరి బాధ్యత

హెచ్ఐవీ నివారణ అందరి బాధ్యత

రెండు నెలల పాటు విస్తృత అవగాహన కార్యక్రమాలు.. క్యూఆర్ కోడ్ పోస్టర్ల ఆవిష్కరణ

కామారెడ్డి:
హెచ్ఐవీ/ఎయిడ్స్ నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని కామారెడ్డి మున్సిపల్
చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి అన్నారు. బుధవారం కామారెడ్డి
జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఐఐఈసీ (Intensified Information,
Education & Communication)
అవగాహన కార్యక్రమాన్ని
డీఎంహెచ్‌ఓతో కలిసి ఆమె జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ మాట్లాడుతూ హెచ్ఐవీపై ప్రజల్లో అవగాహన
పెంచడం, అపోహలను తొలగించడం, అవసరమైన వైద్య సేవలను ప్రజలకు చేరువ చేయడం
ద్వారా వ్యాధి నియంత్రణకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

రెండు నెలల పాటు విస్తృత ప్రచారం

డీఎంహెచ్‌ఓ వెంకట్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు
హెచ్ఐవీ/ఎయిడ్స్ నివారణలో భాగంగా జిల్లాలో విస్తృత ప్రచార కార్యక్రమాన్ని
ప్రారంభించినట్లు తెలిపారు. రాబోయే రెండు నెలల పాటు వివిధ
కేంద్రాలు, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించనున్నట్లు

వెల్లడించారు.

హెచ్ఐవీపై ప్రజలకు అవసరమైన సమాచారం, అవగాహన అందించడంతో పాటు వ్యాధి
నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అందుబాటులో ఉన్న వైద్య సేవలపై
విస్తృత ప్రచారం నిర్వహించనున్నారు.

క్యూఆర్ కోడ్ పోస్టర్ల ఆవిష్కరణ

హెచ్ఐవీకి సంబంధించిన ప్రమాదకర పరిస్థితులు, అందుబాటులో ఉన్న సేవలపై
ప్రజలకు సులభంగా సమాచారం అందించేందుకు క్యూఆర్ కోడ్ గోడ
పత్రికలను
కార్యక్రమంలో ఆవిష్కరించారు.

ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్న వ్యక్తులు ఈ క్యూఆర్ కోడ్ పోస్టర్లను
సద్వినియోగం చేసుకుని అవసరమైన సేవలు, సమాచారాన్ని పొందాలని అధికారులు
సూచించారు. ఏవైనా సందేహాలు ఉంటే 1097 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి
నివృత్తి చేసుకోవాలని కోరారు.

అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొనడం

కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆర్‌ఎంఓ రవీందర్ గౌడ్,
హెచ్ఐవీ నివారణ జిల్లా అధికారి ప్రదీప్ కుమార్,
ఏఆర్‌టీ వైద్యులు స్నేహా, ఆంచల్, వైఆర్‌జీ కేర్
ఉమ్మడి జిల్లా డీఆర్పీ గర్దాస్ సుధాకర్,
కౌన్సిలర్లు మేక నాగరాజు, మిరుదొడ్డి శేఖర్,
పాముల లలిత కుమారి, మెహరాజ్, చిరంజీవి, ప్రవీణ్ గౌడ్
,
ఎస్‌ఎస్‌కే మేనేజర్ శ్రీనివాస్ గౌడ్తో పాటు వివిధ
స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

కామారెడ్డిలో హెచ్ఐవీ అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న
మున్సిపల్ చైర్‌పర్సన్ ఉమారాణి, డీఎంహెచ్‌ఓ వెంకట్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *