మూసివేసిన యూటర్న్‌ను తిరిగి ఓపెన్ చేయాలని ట్రాఫిక్ డీసీపీకి వినతి
మల్కాజిగిరి ట్రాఫిక్ డీసీపీ రాహుల్ రెడ్డిని కలిసి, నాగారం డివిజన్ పరిధిలో మూసివేసిన యూటర్న్‌ను తిరిగి ఓపెన్ చేయాలని నాగారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ రెడ్డి, యువ నాయకుడు కౌకుట్ల జీవన్ రెడ్డి కోరారు.
యూటర్న్ మూసివేయడం వల్ల ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను డీసీపీ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు.
వినతిపై డీసీపీ రాహుల్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. యూటర్న్ ప్రాంతాన్ని స్వయంగా సందర్శించి పరిస్థితులను పరిశీలించిన అనంతరం, దాన్ని తిరిగి ఓపెన్ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గనపురం కొండల్ రెడ్డి, గూడూరు కృష్ణ గౌడ్, సెరినిటీ స్కూల్ ప్రిన్సిపల్ నోముల జంగీ రెడ్డి, సుబ్బారావు, దాసోహం నర్సింగ్ రావు, దాసరి రాంరెడ్డి, పంగా సంతోష్, బుల్లబోయిన ప్రవీణ్ యాదవ్, మామిళ్ల శేఖర్ యాదవ్, షేక్ గౌస్, కిష్టాన్నగారి రవి, మహమ్మద్ తాలీం, సత్యం గౌడ్, మిడాల సతీష్, మనోహర్ చెల్లా, సింహాపురి కాలనీ ప్రెసిడెంట్ మహేష్‌తో పాటు కాలనీ వాసులు పాల్గొన్నారు.