కేసీఆర్ రాజీనామా చేయాలి.. కాప్రాలో కాంగ్రెస్ నాయకుల బైక్ ర్యాలీ
ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ శ్రీ మందుముల పరమేశ్వర్ రెడ్డి గారి పిలుపు మేరకు, మేడ్చల్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీ విఠల్ నాయక్ గారి పర్యవేక్షణలో ఈ ర్యాలీ జరిగింది.
సైనిక్పురి జ్యోతిరావు పూలే జంక్షన్ నుంచి ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్‌లోని డా. బి.ఆర్. అంబేద్కర్ సర్కిల్ వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మోటార్ సైకిళ్లపై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ రాజీనామా చేయాలని, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా శ్రీ విఠల్ నాయక్ మాట్లాడుతూ.. కేసీఆర్ బాధ్యతను విస్మరించారని ఆరోపించారు. అసెంబ్లీకి రావాలని లేదా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ ఉద్యోగి విధులకు గైర్హాజరైతే చర్యలు ఉంటాయని, అదే విధంగా ప్రజల తరఫున అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వహించాల్సిన కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని శ్రీ విఠల్ నాయక్ విమర్శించారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో తన బాధ్యతను నిర్వర్తించాలని డిమాండ్ చేశారు.
కాప్రా డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ తన్నీరు శ్రీహరి మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకుని హోదాలో ప్రభుత్వ సేవలు పొందుతూ అసెంబ్లీకి రాకపోవడం రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరచడమేనని ఆరోపించారు.
తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధనలో విద్యార్థులు, యువకులు చేసిన త్యాగాలను ప్రస్తావిస్తూ.. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. ప్రజలకు ముఖం చాటకుండా తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఏఎస్ రావు నగర్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ కేశెట్టి ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి హాజరుకాని కేసీఆర్ ఆ పదవికి అనర్హుడని విమర్శించారు. ప్రజల కోసం అసెంబ్లీలో తన వాణిని వినిపించాల్సిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడిపై ఉందని అన్నారు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
• కేసీఆర్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకుల డిమాండ్
• రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్
• “కేసీఆర్ డౌన్ డౌన్” అంటూ నినాదాలు
• ఫ్లకార్డులతో మోటార్ సైకిల్ ర్యాలీ
ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ సెక్రటరీలు శ్రీ దండ్ల మురళీ, శ్రీ పాకాల రాజు, జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీ పూర్ణయాదవ్, మాజీ డైరెక్టర్ శ్రీ కొబ్బనూరి నాగరాజు, ఉమ్మడి కాప్రా డివిజన్ మాజీ అధ్యక్షులు శ్రీ కొబ్బనూరి నాగశేషు, ఏఎస్ రావు నగర్ డివిజన్ మాజీ అధ్యక్షులు శ్రీ కొత్త అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీనియర్ కాంగ్రెస్ నాయకులు పి. పవన్ కుమార్, శ్రీధర్ రెడ్డి, నరేందర్ గౌడ్, జి. సత్యనారాయణ, రాకేష్ యాదవ్, డి. సతీష్ యాదవ్, తోటకూర శ్రీకాంత్, కే. రాజు, సి. సత్యనారాయణ, రిజ్వాన్ ఖాన్, అబ్దుల్ అహ్మద్, ప్రదీప్, నాగరాజు యాదవ్, అభిరాజ్, సతీష్ యాదవ్, రాజశీలన్, జీవన్, శివ కుమార్, సిద్దిక్, నర్సింగ్ రావ్, నర్సింహా, ఉమేష్, చోటు భాయ్, అల్లురయ్య, సాహెబ్, శ్రీనివాస్, మహిళా నాయకురాళ్లు స్వర్ణలత, లలిత తదితరులు పాల్గొన్నారు.
యూత్ కాంగ్రెస్ నాయకులు బెవర మనోజ్ కుమార్, ఆకుల సంతోష్, పవన్ కళ్యాణ్, వేణు, విజయ్, యస్వంత్, దయాకర్, బాలుగౌడ్, ఇమ్రాన్, భరత్ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు.