సంపత్ గౌడ్ నాయకత్వంలో TRSకు పెరుగుతున్న ఆదరణ.. జలాల్‌పూర్‌లో 50 మంది పార్టీలో చేరిక

సంపత్ గౌడ్ నాయకత్వంలో TRSకు పెరుగుతున్న ఆదరణ | పవార్ వార్త
నమ్మదగిన వార్తలు • నిజాయితీతో సేవ
Trusted News • Service with Integrity
🔴 తాజా 🔴 LATEST
🎯 సంపత్ గౌడ్ నాయకత్వంలో TRSకు పెరుగుతున్న ఆదరణ – జలాల్‌పూర్‌లో 50 మంది చేరిక 🎯 TRS gaining popularity under Sampath Goud’s leadership – 50 join in Jalalpur
రాజకీయాలు Politics

సంపత్ గౌడ్ నాయకత్వంలో TRSకు పెరుగుతున్న ఆదరణ

TRS gaining popularity under Sampath Goud’s leadership

జోరందుకున్న TRS చేరికలు – అందరి చూపు సంపత్ గౌడ్ వైపు

TRS joinings intensifying – All eyes on Sampath Goud

ఈరోజుToday ఎల్లారెడ్డిEllareddy 5.3K వీక్షణలుviews
ఎల్లారెడ్డి నియోజకవర్గం – జలాల్‌పూర్ గ్రామం – TRS పార్టీ చేరికలు Ellareddy Constituency – Jalalpur Village – TRS Party Joinings
జలాల్‌పూర్Jalalpur
ఎల్లారెడ్డిEllareddy
TRS
50+
మంది పార్టీలో చేరిక – జలాల్‌పూర్ గ్రామం
members joined the party – Jalalpur Village

సంపత్ గౌడ్ / Sampath Goud

నియోజకవర్గ ఇన్‌చార్జి, TRS

Constituency In-charge, TRS

కండువాలు కప్పి ఆహ్వానించారు Welcomed with party scarves

ముఖ్యాంశాలు Key Highlights

జలాల్‌పూర్ గ్రామానికి చెందిన 50 మంది TRSలో చేరిక 50 members from Jalalpur village joined TRS
సంపత్ గౌడ్ కండువాలు కప్పి సాదర ఆహ్వానం Sampath Goud welcomed with party scarves
గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం – ప్రజా సమస్యల పరిష్కారం Party strengthening at village level – public issues resolution
విద్య, వైద్యం, ఉపాధి, అభివృద్ధి – కొత్త రాజకీయ కార్యాచరణ Education, Health, Employment, Development – new political agenda
పంచజన్యం ఎజెండా – 5 ప్రధాన అంశాలు Panchajanyam agenda – 5 key points

“పంచజన్యం” ఎజెండా – 5 అంశాలు “Panchajanyam” Agenda – 5 Points

ఉచిత విద్య Free Education
ఉచిత వైద్యం Free Healthcare
ఉపాధి Employment
రైతు సంక్షేమం Farmer Welfare
సామాజిక న్యాయం Social Justice
50+
చేరికలు
Joinings
1
గ్రామం
Village
5
పంచజన్యం
Panchajanyam
25+
నాయకులు
Leaders

ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సేన (TRS)లోకి చేరికలు ఊపందుకుంటున్నాయి. మండలంలోని జలాల్‌పూర్ గ్రామానికి చెందిన సుమారు 50 మంది పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి నియోజకవర్గ TRS ఇన్‌చార్జి సంపత్ గౌడ్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

Ellareddy: TRS party joinings are intensifying in Ellareddy constituency. About 50 members from Jalalpur village took party membership. On this occasion, Ellareddy constituency TRS in-charge Sampath Goud welcomed them warmly by draping party scarves.

గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారం కోసం ముందుకు సాగడమే లక్ష్యంగా TRS కార్యకర్తలు పనిచేస్తున్నారని నాయకులు తెలిపారు. జలాల్‌పూర్‌లో జరిగిన చేరికలతో పార్టీకి గ్రామస్థాయిలో మరింత బలం చేకూరిందని పేర్కొన్నారు.

TRS workers are working with the goal of strengthening the party at the village level and directly understanding public issues to resolve them. Leaders said that the joinings in Jalalpur have further strengthened the party at the grassroots level.

సంపత్ గౌడ్ నాయకత్వంపై చర్చ Discussion on Sampath Goud’s Leadership

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో TRS కార్యకలాపాలు విస్తరిస్తున్న నేపథ్యంలో పార్టీ ఇన్‌చార్జి సంపత్ గౌడ్ నాయకత్వంపై స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. గ్రామాల వారీగా పార్టీ శ్రేణులను సమన్వయం చేస్తూ కొత్త నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

In the backdrop of TRS activities expanding in Ellareddy constituency, discussions have started in local political circles about the leadership of party in-charge Sampath Goud. Party sources say efforts are being made to coordinate party ranks village-wise and take new leadership forward.

ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడం, గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ కార్యక్రమాలను విస్తరించడం, యువతను రాజకీయంగా భాగస్వామ్యం చేయడం వంటి అంశాలపై దృష్టి సారిస్తున్నట్లు నాయకులు తెలిపారు.

Leaders said they are focusing on directly engaging with people to understand their issues, expanding party programs in rural areas, and involving youth politically.

విద్య, వైద్యానికి ప్రాధాన్యత Priority to Education & Healthcare

TRS అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించిన “పంచజన్యం” ఎజెండాలో ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉపాధి, రైతు సంక్షేమం, సామాజిక న్యాయం వంటి ఐదు ప్రధాన అంశాలను ముందుకు తెచ్చారు.

TRS President Kalvakuntla Kavitha announced the “Panchajanyam” agenda with five key points: free education, free healthcare, employment, farmer welfare, and social justice.

విద్య విషయంలో పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించే విధంగా కేజీ నుంచి ఉన్నత విద్య వరకు అవకాశాలు కల్పించాలనే ఆలోచనను కవిత ముందుకు తెచ్చారు. ప్రభుత్వ విద్యతో పాటు ప్రైవేట్ విద్యను కూడా అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే ప్రతిపాదనలను ఆమె ప్రస్తావించారు.

Kavitha brought forward the idea of providing opportunities from KG to higher education to reduce the financial burden on poor and middle-class families. She mentioned proposals to make private education accessible to all along with government education.

అదేవిధంగా వైద్యం కోసం కుటుంబాలు ఆర్థికంగా కుదేలుకాకుండా ఉచిత ఆరోగ్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం తమ ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా కవిత పేర్కొన్నారు.

Similarly, Kavitha stated that bringing free health services to prevent families from being financially ruined for medical care is one of their main goals.

ప్రజా సమస్యలను కేంద్రంగా చేసుకుని పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేస్తామని అన్నారు. విద్య, వైద్యం, ఉపాధి, రైతు సంక్షేమం, సామాజిక న్యాయం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు స్థానిక సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడతామని తెలిపారు.
Leaders said they will strengthen the party at the village level focusing on public issues. They stated that they will continuously fight to bring education, healthcare, employment, farmer welfare, social justice issues to the people and resolve local problems.

పాలిటెక్నిక్ విద్యపై ప్రత్యేక దృష్టి Special Focus on Polytechnic Education

ఇటీవల పాలిటెక్నిక్ విద్యకు సంబంధించిన సమస్యలను అధ్యయనం చేసేందుకు కవిత ఆధ్వర్యంలో విద్యావేత్తలు, పార్టీ నాయకులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన GO 97 నేపథ్యంలో విద్యార్థుల్లో వ్యక్తమవుతున్న ఆందోళనలు, పాలిటెక్నిక్ విద్య భవిష్యత్తు, విద్యా వ్యవస్థలో మార్పుల ప్రభావం వంటి అంశాలను కమిటీ అధ్యయనం చేయనుంది.

Recently, a special committee was formed under Kavitha’s leadership with educationists and party leaders to study the issues related to polytechnic education. The committee will study the concerns being raised by students in the backdrop of GO 97 issued by the state government, the future of polytechnic education, and the impact of changes in the education system.

కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు Leaders who participated

బాగారెడ్డి / Bagareddy

మండల సీనియర్ నాయకుడు

Mandal Senior Leader

ఖలీల్ / Khaleel

మండల కార్యదర్శి

Mandal Secretary

మాణిక్యం / Manikyam

నాయకుడు

Leader

ప్రభాకర్ / Prabhakar

నాయకుడు

Leader

శ్రీను / Srinu

మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు

Mandal SC Cell President

జైల్ సింగ్ / Jail Singh

జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు

District ST Cell President

ఫహీమ్ / Faheem

మండల యువజన అధ్యక్షుడు

Mandal Youth President

మోహన్ / Mohan

యువజన అధ్యక్షుడు

Youth President

కార్యక్రమ క్రమం Program Sequence

పార్టీ చేరికల ప్రారంభం

Party Joinings Begin

జలాల్‌పూర్ గ్రామంలో 50 మంది TRSలో చేరిక

50 members from Jalalpur village join TRS

కండువాలు కప్పి ఆహ్వానం

Welcomed with Scarves

సంపత్ గౌడ్ పార్టీ కండువాలు కప్పి సాదర ఆహ్వానం

Sampath Goud warmly welcomed with party scarves

నాయకత్వ చర్చ

Leadership Discussion

గ్రామస్థాయిలో పార్టీ బలోపేతంపై చర్చ

Discussion on strengthening party at village level

పంచజన్యం ఎజెండా ప్రకటన

Panchajanyam Agenda Announcement

కవిత 5 ప్రధాన అంశాల ప్రకటన – ఉచిత విద్య, వైద్యం

Kavitha announces 5 key points – free education, healthcare

పాలిటెక్నిక్ కమిటీ ఏర్పాటు

Polytechnic Committee Formation

విద్యా సమస్యల అధ్యయనానికి ప్రత్యేక కమిటీ

Special committee for education issues study

ఈ చేరికల కార్యక్రమంలో TRS మండల సీనియర్ నాయకులు బాగారెడ్డి, మండల కార్యదర్శి ఖలీల్, నాయకులు మాణిక్యం, ప్రభాకర్, టీంకు సాయిలు, కాటేపల్లి సాయిలు, తలరి రాములు, గంగయ్య, బీసా సాయిలు, ధారబోయిన భూమయ్య, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీను, మండల మైనారిటీ నాయకులు జహీర్, ఎజాస్, మండల యువజన అధ్యక్షుడు ఫహీమ్, జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు జైల్ సింగ్, లింగంపేట మండల అధ్యక్షుడు పోకల సాయిరాం, యువజన అధ్యక్షుడు మోహన్, నాయకులు కృష్ణ గౌడ్, రవి తదితరులు పాల్గొన్నారు.

TRS mandal senior leader Bagareddy, mandal secretary Khaleel, leaders Manikyam, Prabhakar, Teinku Sailu, Katepalli Sailu, Talari Ramulu, Gangayya, Beesa Sailu, Dharaboyina Bhoomayya, mandal SC cell president Srinu, mandal minority leaders Jahir, Ejas, mandal youth president Faheem, district ST cell president Jail Singh, Lingampet mandal president Pokala Sairam, youth president Mohan, leaders Krishna Goud, Ravi and others participated in this joining program.

జలాల్‌పూర్‌లో జరిగిన ఈ చేరికలతో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో TRS రాజకీయ కార్యకలాపాలు మరింత వేగం పుంజుకున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది. గ్రామస్థాయిలో బలం పెంచుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో సంపత్ గౌడ్ నాయకత్వం ఎలా ప్రభావం చూపుతుందనేది రాబోయే రోజుల్లో ఆసక్తికరంగా మారనుంది.

With these joinings in Jalalpur, discussions continue in political circles that TRS political activities have gained more momentum in Ellareddy constituency. How Sampath Goud’s leadership will impact in strengthening the party at the village level and taking it forward is set to become interesting in the coming days.

🎯 రాజకీయ అప్‌డేట్స్ పొందండి

🎯 Get Political Updates

తాజా రాజకీయ వార్తల కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి

Follow us for latest political news

వాట్సాప్‌లో చేరండి Join on WhatsApp

Leave a Reply