వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
హైదరాబాద్: ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు వంపుగూడ డివిజన్‌లో దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని వైఎస్సార్ సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు ఉన్నత విద్య అందించేందుకు ఫీజు రీయింబర్స్‌మెంట్, పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ, అత్యవసర వైద్య సేవల కోసం 108 అంబులెన్స్ సేవలు, పేదల ఆహార భద్రత కోసం తక్కువ ధరకు బియ్యం, రైతులకు ఉచిత విద్యుత్ వంటి పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారని గుర్తుచేశారు.
వైఎస్సార్ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాల వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన అనేక మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి డాక్టర్లు, ఇంజనీర్లు, డిగ్రీ పట్టభద్రులు అయ్యే అవకాశం లభించిందని పేర్కొన్నారు.
రైతులు, పేదలు, విద్యార్థులు, మహిళలు సహా అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని నాయకులు అన్నారు.
“ప్రజల కోసం పనిచేసిన వైఎస్సార్ ప్రజల గుండెల్లో ఎప్పటికీ జీవించే ఉంటారు” అని నాయకులు పేర్కొంటూ ఆయనకు ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో వంపుగూడ డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, NSUI కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సేవలను స్మరించుకుంటూ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించారు. ప్రజల సంక్షేమం కోసం ఆయన చేపట్టిన పలు కార్యక్రమాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
జోహార్ వైఎస్సార్ 💐🙏