మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు ఘన నివాళులు
మాజీ ముఖ్యమంత్రి, దివంగత డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్, శామీర్‌పేట్ డివిజన్ దేవరయాంజాల్‌లో ఘనంగా నివాళులు అర్పించారు.
దేవరయాంజాల్‌లోని వైఎస్సార్ విగ్రహానికి మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా ఆర్టీఏ మెంబర్ భీమిడి జైపాల్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
వైఎస్సార్ సేవలను స్మరించిన నేతలు
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టారని గుర్తుచేశారు. పేదలు, రైతులు, విద్యార్థులు, మహిళలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో చెరగని ముద్ర వేశాయని పేర్కొన్నారు.
ప్రత్యేకంగా ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత విద్యుత్, రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాల ద్వారా వైఎస్సార్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని నాయకులు పేర్కొన్నారు.
ఆయన మరణించి సంవత్సరాలు గడిచినా ప్రజాసేవ, సంక్షేమ పాలనను ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు. వైఎస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజలకు సేవ చేయడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని నాయకులు పేర్కొన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు
ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ టి. శంకర్ గౌడ్, శ్రీ సీతారామ స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ పి. లక్ష్మినారాయణ, మాజీ ధర్మకర్తలు ఎ. భారతి, వి. మురళి గౌడ్, బి. కొండల్ రెడ్డి, యన్. హరిగోపాల్, జి. హరికృష్ణ, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పి. ధర్మారెడ్డి, యస్. దుర్గయ్య, కె. రాము, ఆర్. శ్రీనివాస్ యాదవ్, డి. కేశవులు, కాంగ్రెస్ నాయకులు యమ్. సాయి కుమార్, కె. లక్ష్మణ్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె. రమేశ్, యూత్ కాంగ్రెస్ నాయకుడు యమ్. హరివర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
జోహార్ వైఎస్సార్ 💐🙏
— పవార్ వార్త