వెల్లుట్లలో కల్లులో నిషేధిత మత్తు పదార్థాలు.. కల్లు దుకాణంపై పోలీసుల దాడి
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని వెల్లుట్ల గ్రామంలో నిషేధిత మత్తు పదార్థాలు కలిపిన కల్లు విక్రయిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం సాయంత్రం పోలీసులు దాడులు నిర్వహించారు.
గ్రామానికి చెందిన సాతెల్లి నాగేశ్వర్ గౌడ్ తన కల్లు దుకాణంలో నిషేధిత మత్తు పదార్థాలను కల్లులో కలిపి విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో, ఈగల్ (EAGLE) బృందం మరియు ఎల్లారెడ్డి పోలీసులు సంయుక్తంగా దుకాణంలో తనిఖీలు చేపట్టారు.
తనిఖీల్లో లభ్యమైన ఆధారాల మేరకు నిందితుడిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే నిషేధిత మత్తు పదార్థాల విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్
కె. బాలసుబ్రహ్మణ్య చారి
ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్
