చినూర్‌లో టీఆర్ఎస్‌కు జోష్.. పార్టీలో చేరిన 20 మంది
ఎల్లారెడ్డి మండలంలోని చినూర్ గ్రామంలో టీఆర్ఎస్ పార్టీకి
శుక్రవారం కొత్తగా పలువురు చేరడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం
నెలకొంది. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన పలువురు స్థానికులు,
యువకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి
సంపత్ గౌడ్ ఆదేశాల మేరకు
టీఆర్ఎస్ మండల సీనియర్ నాయకుడు బాగారెడ్డి
కొత్తగా పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా బాతులా మల్లయ్య, దాసరి సంజీవులు, దాసరి అరుణ్ కుమార్,
బాతులా బిక్షపతి, దాసరి గంగయ్య, దాసరి యాదమ్మ, దాసరి లలిత,
బాతులా లక్ష్మి, బాతులా భాగ్య, ధనాయిల దుర్గాభవాని, దాసరి సుశీల,
ఎల్లమొళ్ల బాబాయి, ధనాయిల సాయిబాబు, దాసరి విష్ణుతో పాటు
సుమారు 20 మంది యువకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలు
సమన్వయంతో పనిచేయాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల సీనియర్ నాయకులు
బాగారెడ్డి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు
శ్రీను, ఫహీమ్
తదితరులు పాల్గొన్నారు.
