బొమ్మరాసిపేట్ భూ బాధితుల ధర్నాకు మద్దతు తెలిపిన మల్లారెడ్డి
మేడ్చల్ నియోజకవర్గం శామీర్‌పేట్ మండల రెవెన్యూ కార్యాలయం వద్ద
బొమ్మరాసిపేట్ గ్రామ భూ బాధితులు చేపట్టిన ధర్నా కార్యక్రమానికి
మాజీ మంత్రి, మేడ్చల్ నియోజకవర్గ శాసనసభ్యులు
చామకూర మల్లారెడ్డి మద్దతు తెలిపారు.
బొమ్మరాసిపేట్ గ్రామానికి చెందిన భూ బాధితులకు మద్దతుగా నిర్వహించిన
ధర్నాలో బీఆర్‌ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ
ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్తో కలిసి
మల్లారెడ్డి పాల్గొన్నారు.
భూ బాధితుల సమస్యలను ప్రభుత్వం, సంబంధిత అధికారులు పరిష్కరించాలని
ఈ సందర్భంగా నాయకులు కోరారు. బాధితులకు అండగా ఉంటామని బీఆర్‌ఎస్
నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్
మధుకర్ రెడ్డి, మల్కాజ్‌గిరి పార్లమెంట్
బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జ్ లక్ష్మారెడ్డి,
ముడుచింతలపల్లి మున్సిపాలిటీ చైర్మన్ రవి,
మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, రైతులు తదితరులు
పాల్గొన్నారు.
