కరీంనగర్–సిరిసిల్ల–వేములవాడ–కామారెడ్డి–ఎల్లారెడ్డి–పిట్లం (KKY) జాతీయ రహదారికి తక్షణ ఆమోదం కోరిన ఎమ్మెల్యే మదన్ మోహన్ | బండి సంజయ్‌కు వినతి

కరీంనగర్–సిరిసిల్ల–వేములవాడ–కామారెడ్డి–ఎల్లారెడ్డి–పిట్లం (KKY) జాతీయ రహదారికి తక్షణ ఆమోదం ఇవ్వాలి

కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను కలిసి వినతిపత్రం అందజేసిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్

” alt=”ఎమ్మెల్యే మదన్ మోహన్ – కేంద్ర మంత్రి బండి సంజయ్ భేటీ” style=”width:100%; max-width:850px; border-radius:8px;”>

న్యూఢిల్లీ: తెలంగాణ ఉత్తర, పశ్చిమ ప్రాంతాల అభివృద్ధికి అత్యంత కీలకంగా భావిస్తున్న
కరీంనగర్–సిరిసిల్ల–వేములవాడ–కామారెడ్డి–ఎల్లారెడ్డి–పిట్లం (KKY) రాష్ట్ర రహదారిని
జాతీయ రహదారిగా ప్రకటించి తక్షణమే పరిపాలనా, ఆర్థిక అనుమతులు మంజూరు చేయాలని
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
బండి సంజయ్ కుమార్ను ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు.

సుమారు 165 కిలోమీటర్ల పొడవు గల ఈ రహదారిని జాతీయ రహదారిగా అభివృద్ధి చేస్తే
తెలంగాణలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందడంతో పాటు
మహారాష్ట్ర రాష్ట్రంతో అనుసంధానం మరింత బలోపేతం అవుతుందని ఎమ్మెల్యే వివరించారు.
ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం
సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.

అలాగే జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్కు కూడా వినతిపత్రం అందజేశారు.
ఈ అంశాన్ని కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ మంత్రి
నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లి, KKY జాతీయ రహదారి ప్రతిపాదనకు త్వరితగతిన
ఆమోదం పొందేలా చర్యలు తీసుకోవాలని ఎంపీని కోరారు.

ఈ ప్రతిపాదనకు సంబంధించిన సాంకేతిక, పరిపాలనా పరిశీలనలు ఇప్పటికే పూర్తయ్యాయని,
తెలంగాణ ప్రభుత్వం పలుమార్లు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖకు సిఫార్సులు పంపిందని
వినతిపత్రంలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ తుది ఆమోదం కోసం
ఎదురుచూస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.

ప్రతిపాదిత జాతీయ రహదారి
ఎన్‌హెచ్–563 (కరీంనగర్), ఎన్‌హెచ్–44 (కామారెడ్డి),
ఎన్‌హెచ్–765డీ (ఎల్లారెడ్డి), ఎన్‌హెచ్–161 (పిట్లం)

జాతీయ రహదారులను అనుసంధానించే కీలక కారిడార్‌గా మారనుంది.
ఈ రహదారి అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడమే కాకుండా,
వ్యవసాయం, వాణిజ్యం, పారిశ్రామిక రంగం, సరుకు రవాణా, పర్యాటకం అభివృద్ధి చెందడంతో పాటు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడకు చేరుకోవడం మరింత సులభతరం కానుంది.

ఇప్పటికే కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నుంచి
ఈ ప్రతిపాదనకు సూత్రప్రాయ ఆమోదం లభించిందని, అనంతరం అవసరమైన సాంకేతిక నివేదికలు,
గ్రీన్‌ఫీల్డ్ అలైన్‌మెంట్‌తో పాటు ఇతర వివరాలను కూడా సమర్పించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం 2022లో, రాష్ట్ర రోడ్లు–భవనాల శాఖ
2024లో కూడా ఈ రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి
సిఫార్సు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

ఈ నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న కరీంనగర్–పిట్లం 165 కిలోమీటర్ల జాతీయ రహదారి
ప్రతిపాదనకు వెంటనే ఆమోదం తెలిపి, అవసరమైన పరిపాలనా మరియు ఆర్థిక అనుమతులను
వేగవంతం చేయాలని ఎమ్మెల్యే మదన్ మోహన్ కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను కోరారు.


— తెలంగాణ పవార్ దినపత్రిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *