దళితుల హామీలు వెంటనే అమలు చేయాలి.. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం : డీహెచ్‌పీఎస్ హెచ్చరిక

మేడ్చల్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా.. కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత

మేడ్చల్, ఆగస్టు 3 (తెలంగాణ పవార్): దళితులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డీహెచ్‌పీఎస్ (దళిత హక్కుల పోరాట సమితి) రాష్ట్ర, జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా డీహెచ్‌పీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యుడు చిలుముల మల్లేశం మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకు ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు కాలేదని విమర్శించారు. ఇంద్రమ్మ ఇళ్లను పూర్తిస్థాయిలో మంజూరు చేయాలని, అంబేద్కర్ అభయహస్తం పథకం కింద ప్రతి అర్హ దళిత కుటుంబానికి రూ.12 లక్షల ఆర్థిక సహాయం అందించాలని కోరారు.

అదేవిధంగా ఎస్సీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, భూమి హక్కులు ఇవ్వడం, రెండో విడత ఇంద్రమ్మ ఇళ్ల కేటాయింపులో దళితులకు ప్రాధాన్యం కల్పించడం, గ్రామాల్లో బెల్ట్ షాపులను తక్షణమే మూసివేయడం వంటి డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం దళితుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని డీహెచ్‌పీఎస్ నాయకులు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి దర్శనం యాదగిరి, డీహెచ్‌పీఎస్ జిల్లా నాయకులు ఆనందరావు, అశోక్, సోమన్న, నాచారం మండల అధ్యక్షురాలు శోభ, ఏఐటీయూసీ సీనియర్ నాయకుడు కృపాకర్, అలాగే రాములు, రేణుక, యాదమ్మ, యాకమ్మ, జయమ్మ, అనురాధ తదితరులు పాల్గొన్నారు.

డిమాండ్లు:
✔ ఇంద్రమ్మ ఇళ్లను వెంటనే మంజూరు చేయాలి.
✔ అంబేద్కర్ అభయహస్తం కింద రూ.12 లక్షల ఆర్థిక సహాయం అందించాలి.
✔ ఎస్సీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి.
✔ భూమి హక్కులు ఇవ్వాలి.
✔ రెండో విడత ఇంద్రమ్మ ఇళ్లలో దళితులకు ప్రాధాన్యం కల్పించాలి.
✔ గ్రామాల్లో బెల్ట్ షాపులను వెంటనే మూసివేయాలి.


— తెలంగాణ పవార్ దినపత్రిక

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply