మానవత్వం చాటిన రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్తా.. దివ్యాంగుడి అంత్యక్రియలకు ఆర్థిక సాయం

దివ్యాంగుని అంత్యక్రియలకు రూ.5 వేల ఆర్థిక సాయం అందజేసిన మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్తా

జవహర్ నగర్‌లో మానవత్వాన్ని చాటిన మాజీ డిప్యూటీ మేయర్ – బాధిత కుటుంబానికి అండగా ఉంటానని హామీ

జవహర్ నగర్, ఆగస్టు 3 (తెలంగాణ పవార్): జవహర్ నగర్‌కు చెందిన దివ్యాంగుడు సమ్మయ్య అంత్యక్రియల నిర్వహణకు మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్తా రూ.5,000 ఆర్థిక సహాయం అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.

సుమారు 15 రోజుల క్రితం సమ్మయ్యను ఓ కారు ఢీకొనడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. మొదట ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించినప్పటికీ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సమ్మయ్య మృతి చెందారు.

ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొనార్ దుర్గాప్రసాద్ మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్తా దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ సందర్భంగా రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ, దివ్యాంగుల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని, సమ్మయ్య కుటుంబానికి భవిష్యత్తులో కూడా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొనార్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, గతంలో సమ్మయ్య గృహ నిర్మాణానికి కూడా రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్తా సహాయం చేశారని గుర్తు చేశారు. జవహర్ నగర్ ప్రాంతంలోని వికలాంగులకు నిరంతరం అండగా నిలుస్తూ సహాయ సహకారాలు అందిస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి తరఫున ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, చెన్నాపురం రమేష్, పెట్రోల్ బంక్ నరసింహ, అనూక్ ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యాంశం: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దివ్యాంగుడు సమ్మయ్య అంత్యక్రియల కోసం మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్తా వెంటనే స్పందించి రూ.5 వేల ఆర్థిక సాయం అందించి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు.


— తెలంగాణ పవార్ దినపత్రిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *