ఎల్లారెడ్డిలో ఘనంగా తిరంగా ర్యాలీ.. జాతీయ జెండాలతో మార్మోగిన పట్టణం
భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ ప్రధానమంత్రి
నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో
శుక్రవారం ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు.
పట్టణంలోని రామాలయం నుంచి ప్రారంభమైన తిరంగా ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా,
గాంధీ చౌక్ మీదుగా శివాజీ విగ్రహం వరకు కొనసాగింది. జాతీయ జెండాలు
చేతబూని నాయకులు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొని దేశభక్తిని చాటారు.
అనంతరం పట్టణంలోని పలువురు దుకాణదారులకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు.
ప్రతి ఇంటిపై, ప్రతి వ్యాపార సంస్థపై జాతీయ జెండా ఎగురవేసి స్వాతంత్ర్య
దినోత్సవాన్ని దేశభక్తి భావంతో జరుపుకోవాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు మర్రి బాలకిషన్,
జిల్లా నాయకులు, మాజీ సర్పంచ్ బత్తిని దేవేందర్,
పట్టణ అధ్యక్షులు ఏ.డి. రాజేష్,
మండల అధ్యక్షులు పెద్దెడ్ల నర్సింలు,
సాయిరెడ్డి, అశోక్, కాశీనాథ్, సత్యం, శివ, రాజు, సాయిలు,
సర్చేంద్ శ్రీనివాస్, తులసి, బబ్లు కౌశిక్, ఎస్. రెడ్డి తదితరులు
పాల్గొన్నారు.

