బిచ్కుంద భద్రాల్ తండాలో సేవాలాల్ మహారాజ్ పోతిపురాణం సమాప్తం
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని భద్రాల్ తండాలో చివరి శ్రావణ సోమవారం సందర్భంగా సేవాలాల్ మహారాజ్ లీలామృత్ పోతిపురాణం సమాప్తం కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ జగదాంబ దేవి సేవాలాల్ మహారాజ్ మందిరంలో సల్కాబాయి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
కార్యక్రమం ముగింపు సందర్భంగా జగదాంబ దేవి, సేవాలాల్ మహారాజ్‌లకు భోగ్ పూజ నిర్వహించి అనంతరం ఆరతి చేశారు.
మహారాష్ట్రలోని ముక్రాంబాద్ నుంచి శివాజీ గురూజీ హాజరై ఐదు రోజుల పాటు సేవాలాల్ మహారాజ్ పోతిపురాణాన్ని చదివి, దాని చరిత్రను బంజారా భాషలో అందరికీ అర్థమయ్యే విధంగా వివరించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఐదు రోజుల కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన అనంతరం సమాప్తం కార్యక్రమాన్ని నిర్వహించారు.
శ్రీ జగదాంబ దేవి, సేవాలాల్ మహారాజ్ చరిత్ర గొప్పదని కార్యక్రమంలో పేర్కొన్నారు.
మందిరం పూజారి శ్రీనివాస్ మహారాజ్, సల్కాబాయి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తండా పెద్దలు నాయక్ కోరోభారి, రాంసింగ్ నాయక్, శ్రీనివాస్ మహారాజ్, దేవిదాస్ మహారాజ్, శీను మహారాజ్, కిషన్ మహారాజ్, కొట్య మహారాజ్, మోతీబాయి, తోతిబాయి, రాంబాయి, పింకీబాయి, లలితాబాయి తదితరులతో పాటు యువతీ యువకులు, పిల్లలు, పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అమ్మవారి, సేవాలాల్ మహారాజ్ ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు.