చివరి శ్రావణ సోమవారం రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న కాంగ్రెస్ నాయకులు
ఎల్లారెడ్డి మండలం వెల్లుట్లపేటలోని శ్రీ శనంగిపల్లి రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో చివరి శ్రావణ సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు.
ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కురుమ సాయిబాబా, మండల కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి ఆలయాన్ని సందర్శించి శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
ఈ సందర్భంగా ఎల్లారెడ్డి మండల ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో అభివృద్ధి చెందాలని, పరమశివుని ఆశీస్సులు ఎల్లారెడ్డి మండల ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కాంగ్రెస్ నాయకులు ప్రత్యేకంగా ప్రార్థించారు.
శ్రావణ మాసంలోని చివరి సోమవారం సందర్భంగా ఆలయం భక్తులతో సందడిగా మారింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు భక్తిభావంతో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.