చీర్యాల ZPHSకు మంచినీటి నల్లా కనెక్షన్ కోసం చర్యలు
చీర్యాల జిల్లా పరిషత్ హైస్కూల్ (ZPHS)కు మంచినీటి నల్లా కనెక్షన్ కోసం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు.
అడిషనల్ కలెక్టర్ వినతిపత్రాన్ని కీసర సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌కు ఎండార్స్ చేయడంతో, సంబంధిత అధికారికి వినతిపత్రాన్ని సమర్పించినట్లు పేర్కొన్నారు.
వినతిపత్రంపై డిప్యూటీ కమిషనర్ వెంటనే స్పందించి దమ్మాయిగూడ HMWS మేనేజర్‌కు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు.
వెంటనే స్పందించిన డిప్యూటీ కమిషనర్‌కు చీర్యాల గ్రామం తరఫున, ప్రధానోపాధ్యాయుల తరఫున, విద్యార్థినీ విద్యార్థుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.