సైబరాబాద్‌లో వీకెండ్ డ్రంక్ డ్రైవ్.. 182 మందిపై కేసులు
మద్యం మత్తులో వాహనాలు నడిపిన వారిపై కొరడా.. 154 ద్విచక్ర వాహనాలు, 20 కార్లు, 7 ఆటోలు, ఒక హెవీ వాహనం స్వాధీనం
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వీకెండ్ స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో భాగంగా ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 182 మందిని గుర్తించి కేసులు నమోదు చేసినట్లు ట్రాఫిక్ ADCP అడ్మిన్ జి. నరేందర్ వెల్లడించారు.
వార్తకు ప్రతీకాత్మకంగా ఉపయోగించిన ఆన్‌లైన్ చిత్రం.
పట్టుబడిన వారిలో 154 మంది ద్విచక్ర వాహనదారులు, 7 మంది ఆటో డ్రైవర్లు, 20 మంది కార్ల డ్రైవర్లు, ఒక హెవీ వాహనదారుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
బ్లడ్ ఆల్కహాల్ కాన్సన్‌ట్రేషన్ ఆధారంగా మద్యం మోతాదును పరిశీలించారు. 149 మంది 36–200, 25 మంది 201–300, 8 మంది 301–550 MG/100 ML పరిధిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
పట్టుబడిన వారందరినీ చట్టపరమైన చర్యల్లో భాగంగా కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు.
ఆగస్టు 24 నుంచి 29, 2026 వరకు మొత్తం 308 డ్రంక్ డ్రైవింగ్ కేసులను కోర్టులు పరిష్కరించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
301 మందికి జరిమానా విధించగా, 7 మందికి జరిమానాతో పాటు సోషల్ సర్వీస్ విధించినట్లు అధికారులు వెల్లడించారు.
మద్యం సేవించిన వారు వాహనం నడపకుండా ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను ఉపయోగించాలని పోలీసులు సూచించారు.