కొండమల్లెపల్లిలో మహిళా సదస్సు, వంటా వార్పు కార్యక్రమం
కొండమల్లెపల్లి, సెప్టెంబర్ 4: బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు కొండమల్లెపల్లిలో నిర్వహించిన మహిళా సదస్సు, వంటా వార్పు కార్యక్రమంలో దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ నాయక్ పాల్గొని ప్రసంగించారు. బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కేతావత్ భీల్యా నాయక్ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రమావత్ రవీంద్ర కుమార్ నాయక్, కేతావత్ భీల్యా నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను అన్ని విధాలుగా మోసం చేసిందని ఆరోపించారు. కేసీఆర్ కిట్, మహిళలకు రూ.2,500, అమ్మాయిలకు స్కూటీ, పెన్షన్ల పెంపు వంటి హామీలను అమలు చేయలేదని వారు పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీని ఓడించి మళ్లీ బీఆర్‌ఎస్ పార్టీని గెలిపించాలని వారు ప్రజలను కోరారు. అనంతరం రోడ్డుపై వంటా వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు నేనావత్ కిషన్ నాయక్, వివిధ మండలాల మండల అధ్యక్షులు, తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, మహిళా కార్యకర్తలు, బీఆర్‌ఎస్‌వీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.