పేద కుటుంబానికి షబ్బీర్ అలీ చొరవ.. చికిత్స కోసం రూ.3 లక్షల ఎల్‌ఓసీ
కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండల కేంద్రానికి చెందిన యూసుఫ్ కుటుంబానికి చికిత్స విషయంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ చొరవ తీసుకున్నట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. యూసుఫ్ భార్య పర్వీన్ బేగం అనారోగ్యంతో బాధపడుతూ ఆపరేషన్ అవసరమైందని, కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో కాంగ్రెస్ నాయకులను సంప్రదించినట్లు పేర్కొన్నారు.
ఈ విషయాన్ని కాంగ్రెస్ నాయకులు షబ్బీర్ అలీ దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించి నిమ్స్ ఆసుపత్రి వైద్యుడితో మాట్లాడినట్లు తెలిపారు. అనంతరం పర్వీన్ బేగం చికిత్స కోసం ప్రభుత్వ తరఫున రూ.3,00,000 విలువైన ఎల్‌ఓసీ మంజూరైనట్లు పేర్కొన్నారు.
చికిత్స కోసం ఆర్థిక సహాయం అందేలా చొరవ తీసుకున్న షబ్బీర్ అలీకి పర్వీన్ బేగం కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు.