గార్లలో సెప్టెంబర్ 8న ఎమ్మెల్యే కోరం కనకయ్య జన్మదిన వేడుకలు
గార్ల మండలంలో ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే, అంచనాల కమిటీ చైర్మన్ కోరం కనకయ్య జన్మదిన వేడుకలను సెప్టెంబర్ 8, 2026న నిర్వహించనున్నట్లు గార్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాళ్లపల్లి కృష్ణ గౌడ్ తెలిపారు.
జన్మదిన వేడుకల్లో భాగంగా ఉదయం 9 గంటలకు గార్ల సాయిబాబా గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు గార్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పాలు, పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు.
అనంతరం ఉదయం 11 గంటలకు గార్ల నెహ్రూ సెంటర్‌లో కేక్ కటింగ్, మిఠాయి పంపిణీ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తాళ్లపల్లి కృష్ణ గౌడ్ తెలిపారు.
ఈ కార్యక్రమాలకు మండలంలోని సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ BLAలు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు సకాలంలో హాజరు కావాలని తాళ్లపల్లి కృష్ణ గౌడ్ కోరారు.