రూ.20 కోట్లతో తాడ్వాయి–లింగంపల్లి రెండు వరుసల రహదారి పనులకు శ్రీకారం
తాడ్వాయి నుంచి లింగంపల్లి వరకు రెండు వరుసల రహదారి నిర్మాణ పనులను రూ.20 కోట్ల నిధులతో ప్రారంభించినట్లు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం తెలిపింది. ఎమ్మెల్యే మదన్ మోహన్ ప్రత్యేక కృషి, చొరవతో ఈ అభివృద్ధి పనులు ప్రారంభమైనట్లు పేర్కొంది.
రహదారి అభివృద్ధి పూర్తయితే దేమికలాన్, కంకల్, కరడ్‌పల్లి, సదాశివనగర్ మండలంలోని జంగం, లింగంపల్లి తదితర గ్రామాల ప్రజలకు రాకపోకలు సులభతరం కానున్నాయని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం పేర్కొంది. రెండు వరుసల రహదారి అందుబాటులోకి రావడంతో ప్రయాణ సమయం తగ్గడంతో పాటు గ్రామాల మధ్య రవాణా సౌకర్యం మెరుగుపడనుందని తెలిపింది.
ఏళ్లుగా రహదారి అభివృద్ధి కోసం ఎదురుచూస్తున్న ఆయా గ్రామాల ప్రజల్లో పనులు ప్రారంభం కావడంతో హర్షం వ్యక్తమైందని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం పేర్కొంది. రూ.20 కోట్ల నిధులు మంజూరు చేసి రహదారి పనులు ప్రారంభించేందుకు చొరవ చూపిన ఎమ్మెల్యే మదన్ మోహన్‌కు గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలిపినట్లు వెల్లడించింది.