ఎల్లారెడ్డిలో మళ్లీ రోడ్డుపైకి సివిల్ సప్లై బియ్యం.. పర్యవేక్షణపై ప్రశ్నలు
పవార్ వార్త సూత్రా | ప్రత్యేక కథనం ఎల్లారెడ్డి, కామారెడ్డి జిల్లా: ప్రభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించిన బియ్యం రవాణా విషయంలో ఎల్లారెడ్డిలో మరోసారి ప్రశ్నలు తలెత్తాయి. ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై బియ్యం తరలిస్తున్నట్లు కనిపిస్తున్న ఓ లారీ నుంచి బియ్యం కిందికి జారుతున్న దృశ్యాలను తెలంగాణ పవార్ దినపత్రిక కెమెరా బంధించింది. ఆగస్టు 16న మధ్యాహ్నం సుమారు 1:20 గంటల సమయంలో ఈ దృశ్యం కనిపించినట్లు అందుబాటులో ఉన్న…
