అచ్చంపేట్‌లో వరదలకు కొట్టుకుపోయిన కల్వర్టు స్థానంలో నూతన నిర్మాణానికి భూమి పూజ
జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలం అచ్చంపేట్ గ్రామం నుంచి మర్పల్లి, హైవే వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న కల్వర్టు భారీ వరదల కారణంగా కొట్టుకుపోయింది.
దీంతో గ్రామ ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతారావు గారు తక్షణమే స్పందించి, నూతన కల్వర్టు నిర్మాణానికి చర్యలు చేపట్టారు.
ఈ క్రమంలో సెప్టెంబర్ 24న నూతన కల్వర్టు నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతారావు గారు మరియు కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు శ్రీ ఏలే మల్లికార్జున్ గారు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ చికోటి మనోజ్ కుమార్ గారు, నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రజా పండరి గారు, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా నూతన కల్వర్టు నిర్మాణానికి చర్యలు చేపట్టడం పట్ల గ్రామ ప్రజలు ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతారావు గారికి, డీసీసీ అధ్యక్షులకు కృతజ్ఞతలు తెలిపారు.
కొత్త అప్‌డేట్స్ కోసం మా WhatsApp ఛానెల్‌లో జాయిన్ అవ్వండి
WhatsApp ఛానెల్ జాయిన్133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.