ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఫేజ్–2 బూత్ లెవల్ ఏజెంట్ల శిక్షణ
ఎల్లారెడ్డి: శాసనసభ్యులు మదన్ మోహన్ ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఫేజ్–2 బూత్ లెవల్ ఏజెంట్ల (BLA) ప్రత్యక్ష శిక్షణ కార్యక్రమం బుధవారం నిర్వహించారు.
నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన 283 మంది బూత్ లెవల్ ఏజెంట్లకు ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితా, బూత్ స్థాయిలో ఏజెంట్ల బాధ్యతలు, ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై సమగ్ర శిక్షణ అందించారు.
కార్యక్రమానికి డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్, పీసీసీ నాయకుడు యాదయ్య ముఖ్య అతిథులుగా హాజరై BLAలకు దిశానిర్దేశం చేశారు. ట్రైనర్ మల్లేష్ యాదవ్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి, బూత్ స్థాయిలో ఏజెంట్లు చేపట్టాల్సిన విధులు, ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలతో పాటు 283 మంది BLAలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు, ఎన్నికల ప్రక్రియపై కార్యకర్తలకు పూర్తి అవగాహన కల్పించేందుకు ఈ శిక్షణ కార్యక్రమం దోహదపడుతుందని నాయకులు తెలిపారు.