గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో కేటీఆర్, బీఆర్ఎస్ నేతల భేటీ
లోక్ భవన్‌లో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనా చారి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం భేటీ అయింది.
గవర్నర్‌కు వినతి పత్రం
ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై దాడి చేసి, ఆయన నివాసాన్ని ధ్వంసం చేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేసిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఈ అంశంపై జోక్యం చేసుకోవాలని కోరుతూ గవర్నర్‌కు వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు.
అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై పోలీసులు దాడి చేశారని, మహిళా ఎమ్మెల్యేల పట్ల అనుచితంగా ప్రవర్తించారని వారు ఆరోపించారు.
తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.
ఈ అంశాలపై గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరుతూ వినతి పత్రం సమర్పించినట్లు బీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ వార్తను షేర్ చేయండి:
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.