ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగారెడ్డిపేట వార్డుకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరారు. మండల అధ్యక్షుడు జుక్కల సంతోష్ కుమార్ వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి అవకాశాలు, సామాజిక న్యాయం వంటి పంచజన్య అంశాల పట్ల ఆకర్షితులై చేరినట్లు వారు తెలిపారు.
ఎల్లారెడ్డిలో టీఆర్ఎస్లోకి కొత్త చేరికలు
ఇవి కూడా చదవండి
పంచజన్య అంశాల పట్ల ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరిక
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగారెడ్డిపేట వార్డుకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి ఎదుటుగట్ల సంపత్ గౌడ్ సూచనల మేరకు ఎల్లారెడ్డి మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు జుక్కల సంతోష్ కుమార్ వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కోట నాగయ్య, కంసెట్టి అశోక్, ఎర్రం అశోక్, మామిడి కాశీరాం, నర్ల సాయన్న, బండారి నారాయణ, తలారి పోచయ్య, నర్ల సైలు, బండారి రాజు, శేఖర్ తదితరులు పార్టీలో చేరినట్లు పార్టీ నాయకులు తెలిపారు.
టీఆర్ఎస్ ప్రతిపాదిస్తున్న పంచజన్య అంశాలైన విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి అవకాశాలు, సామాజిక న్యాయం పట్ల ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రైతు కమిటీ అధ్యక్షుడు మర్రి బాలయ్య, మండల నాయకులు మామిడి సంగయ్య, కుర్మ మల్లయ్య, బాబు, జగన్ తదితరులు పాల్గొన్నారు.















