🇮🇳 మీసంపల్లిలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ
ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశాలతో కార్యక్రమం.. భారీగా తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు
PHOTO
కార్యక్రమం వివరాలు
ఎల్లారెడ్డి మండలం మీసంపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గౌరవ ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆదేశాల మేరకు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మద్దూరి సాయిలు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
కార్యక్రమానికి ఎల్లారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కురుమ సాయిబాబా, గ్రామ సర్పంచ్ బోండ్ల మైసయ్య, ఉపసర్పంచ్ బాగయ్య, మాజీ పీఏసీఎస్ చైర్మన్ బోండ్ల సాయిలుతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నిరంతరం కృషి చేస్తామని మద్దూరి సాయిలు తెలిపారు.