సదాశివనగర్, అక్టోబర్ 4: సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం భవన నిర్మాణానికి రూ.2 లక్షల ఆర్థిక సహాయం అందించారు డా. పైడి ఎల్లారెడ్డి. భవన నిర్మాణానికి నిర్వహించిన భూమిపూజ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా డా. పైడి ఎల్లారెడ్డి మాట్లాడుతూ సామాజిక అభ్యున్నతి, యువత ఐక్యతతో పాటు అంబేద్కర్ ఆశయాల సాధనకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు నీలం చిన్న రాజులు, రవీందర్ రావు, భూంరావ్ విఠల్, గంగారెడ్డి, గ్రామ సర్పంచ్ నరసింహులు, ఉపసర్పంచ్ గంగాధర్, వార్డు సభ్యుడు పరమేశ్వర్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు శ్యామ్, సంఘం సలహాదారు పోషయ్యతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

భవన నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించిన డా. పైడి ఎల్లారెడ్డికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

