జవహర్‌నగర్, అక్టోబర్ 4: జవహర్‌నగర్ డంపింగ్ యార్డు ప్రభావిత ప్రాంతాల్లో అనారోగ్యాలతో జరుగుతున్న మరణాలపై సమిష్టిగా ఉద్యమం చేపట్టాలని డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాట కమిటీ నేతలు నిర్ణయించారు.

జవహర్‌నగర్‌లోని గబ్బిలాలపేట, వైఎస్సార్ నగర్ తదితర డంపింగ్ యార్డు ప్రభావిత ప్రాంతాల్లో అనారోగ్యాలతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోందని వారు పేర్కొన్నారు. ఈ మరణాలకు రాంకీ చెత్త డంపింగ్ కారణమవుతోందని వారు ఆరోపించారు.

అక్టోబర్ 4న కీసర సర్కిల్ పరిధిలోని జవహర్‌నగర్ జీహెచ్ఎంసీ ప్రాంతంలో సెప్టెంబర్ 26న అనారోగ్యంతో మరణించిన బొల్లం కృష్ణకు నివాళి కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా డంపింగ్ యార్డు నుంచి వెలువడుతున్న విషవాయువులను వెంటనే నివారించాలని, ప్రభావిత ప్రాంతాల ప్రజలకు ఉచిత వైద్య సౌకర్యాలు కల్పించాలని, మంచినీటి సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బొల్లం కృష్ణ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు.

అసహజ మరణాల అంశంపై జేఏసీ భాగస్వామ్య సంస్థలతో సమిష్టిగా చర్చించి, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు త్వరలో కార్యాచరణ రూపొందిస్తామని జేఏసీ చైర్మన్ షేక్ షావలి, కో-కన్వీనర్లు గడ్డం సదానందం, గడిపే సునీత, జర్నలిస్ట్ కొన్నెవేణు, శారదా, సిఎంఎస్ రాష్ట్ర కన్వీనర్ జ్యోతి, కార్యవర్గ సభ్యులు శ్రీదేవి, సిటీ కమిటీ వసంత, అల్లూరి సావిత్రి తదితరులు తెలిపారు.

డంపింగ్ యార్డు సమస్యపై ప్రజా ఉద్యమాన్ని నిర్మించేందుకు చర్యలు చేపడతామని వారు పేర్కొన్నారు.

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply