22-A జాబితా నుంచి భూములను తొలగించాలని బీజేపీ మహాధర్నా
హైదరాబాద్, సెప్టెంబర్ 4: 22-A జాబితాలో అక్రమంగా చేర్చిన భూములను తొలగించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీజేపీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 5న హైదరాబాద్‌లో మహాధర్నా నిర్వహించనున్నట్లు నాగారం డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి పీవీఆర్ తెలిపారు.
రైతులు, పేదలు, భూమి యజమానులు ఎదుర్కొంటున్న భూ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎంపీ ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు నాయకత్వంలో మహాధర్నా జరుగుతుందని పేర్కొన్నారు.
సెప్టెంబర్ 5న ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. నాగారం డివిజన్ ప్రజలు, రైతులు, భూమి యజమానులు, బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
22-A జాబితాలో అక్రమంగా చేర్చిన భూములను తొలగించాలని, రైతులకు న్యాయం చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోందని తెలిపారు.