బోధన్‌లో బీఆర్‌ఎస్ ఆందోళన.. సబ్ కలెక్టరేట్ ముట్టడి
అసెంబ్లీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అరెస్టును నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా బోధన్‌లో బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. పార్టీ పిలుపు మేరకు నాయకులు, కార్యకర్తలు ఆచన్‌పల్లి నుంచి సబ్ కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీగా తరలివచ్చి కార్యాలయాన్ని ముట్టడించారు.
అనంతరం సబ్ కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. అసెంబ్లీలో అరెస్టు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.
ప్రజా సమస్యలపై గళమెత్తుతున్న ప్రతిపక్ష నేతలను నిర్బంధించడం దుర్మార్గమని బీఆర్‌ఎస్ నాయకులు విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ సతీమణి అయేషా ఫాతిమ, స్థానిక బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు, వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బోధన్‌లో బీఆర్‌ఎస్ నిర్వహించిన ఆందోళనకు సంబంధించిన వీడియో.
సబ్ కలెక్టరేట్ వద్ద జరిగిన ఆందోళనకు సంబంధించిన వీడియో.