పిడుగుపాటుకు 21 మేకలు, గొర్రెలు మృతి.. బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్న మంత్రి

ధర్మవరం రూరల్, అక్టోబర్ 1: ధర్మవరం నియోజకవర్గంలోని ములకాపురం గ్రామ సమీపంలో పిడుగుపాటుకు 21 మేకలు, గొర్రెలు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్యాశాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ స్పందించారు. పశువులను కోల్పోయిన బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు ఆయన నియోజకవర్గ ఇన్‌చార్జి హరీష్ బాబు గురువారం ఘటనాస్థలాన్ని సందర్శించారు. పిడుగుపాటుతో మృతి చెందిన మేకలు, గొర్రెలను పరిశీలించి, బాధితుడు బిల్లే విజయ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

కురుబ సామాజిక వర్గానికి చెందిన బిల్లే విజయ్‌ను కలిసి ఘటనకు సంబంధించిన వివరాలను హరీష్ బాబు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనలో సుమారు రూ.2.50 లక్షల మేర ఆర్థిక నష్టం వాటిల్లిందని బాధితుడు వివరించినట్లు ఆయన తెలిపారు.

అనంతరం ఘటనకు సంబంధించిన వివరాలను హరీష్ బాబు మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు ఫోన్ ద్వారా తెలియజేశారు. బాధితుడు బిల్లే విజయ్‌తో కూడా మంత్రితో ఫోన్‌లో మాట్లాడించారు. ఈ సందర్భంగా పిడుగుపాటు ఘటనపై మంత్రి విచారం వ్యక్తం చేసి, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

ఈ ఘటనపై ఇప్పటికే జిల్లా కలెక్టర్, ఆర్డీవోలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నట్లు మంత్రి తెలిపారు. పంచనామా ప్రక్రియ పూర్తయిన అనంతరం ప్రభుత్వ నిబంధనల ప్రకారం బాధిత కుటుంబానికి అవసరమైన సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పశువులను కోల్పోయిన కుటుంబానికి సాధ్యమైనంత మేర ఆర్థిక సహాయం అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.

త్వరితగతిన పంచనామా పూర్తి చేయాలి

పిడుగుపాటుతో మృతి చెందిన మేకలు, గొర్రెలకు సంబంధించి ఘటనాస్థలంలోనే పంచనామా ప్రక్రియ చేపట్టారు. ధర్మవరం మండల పశువైద్యాధికారి డాక్టర్ కె. శేఖర్ ఆధ్వర్యంలో మృతి చెందిన పశువుల వివరాలను నమోదు చేస్తున్నారు.

పంచనామా ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి నివేదికను సంబంధిత అధికారులకు అందించాలని హరీష్ బాబు పశువైద్యాధికారి డాక్టర్ కె. శేఖర్‌కు సూచించారు. తద్వారా బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా అందాల్సిన సహాయం త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రూరల్ మండల అధ్యక్షుడు గొట్లూరు చంద్ర, బీజేపీ నాయకులు శంకర్ రెడ్డి, చింతలపల్లి రమేష్, నారాకొండయ్య చౌదరి, తెలుగు యువత ధర్మవరం రూరల్ అధ్యక్షుడు చిట్ర అశోక్‌తో పాటు పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ఈ వార్తను షేర్ చేయండి
🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply