బ్రహ్మణపల్లి, జంగమాయిపల్లిలో కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ
తాజా రాజకీయ వార్త

బ్రహ్మణపల్లి, జంగమాయిపల్లిలో కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమాలు

కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్
బ్రహ్మణపల్లి కార్యక్రమం
జంగమాయిపల్లి కార్యక్రమం
కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం
గ్రామ ప్రజలు మరియు నాయకులు
ఎల్లారెడ్డి నియోజకవర్గం

గ్రామాల్లో ఘనంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం

📍 కార్యక్రమం

బ్రహ్మణపల్లి, జంగమాయిపల్లి

🏛️ నియోజకవర్గం

ఎల్లారెడ్డి నియోజకవర్గం

💰 అభివృద్ధి నిధులు

SHG భవనాలకు ఒక్కొక్కటి ₹10 లక్షలు

ఎల్లారెడ్డి మండలంలోని బ్రహ్మణపల్లి, జంగమాయిపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఈ కార్యక్రమాల్లో పాల్గొని కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా గ్రామాల్లో స్వయం సహాయక సంఘాల (SHG) భవనాలకు ఒక్కొక్కటి రూ.10 లక్షల విలువైన నిధులతో చేపడుతున్న నిర్మాణ కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నాం.

గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం, తాగునీటి సమస్యల పరిష్కారం, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, కొత్త రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం పంపిణీ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.

అదేవిధంగా ప్రజలకు అత్యవసర వైద్య సహాయం అందించేందుకు తన ప్రత్యేక చొరవతో ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) చెక్కులు, LOCలు రికార్డు స్థాయిలో మంజూరు చేయించినట్లు మదన్ మోహన్ తెలిపారు.

ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే సూచించారు.

ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) చైర్మన్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మండల సీనియర్ నాయకులు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

🏠 PROPERTY FOR SALE
📍 ఎల్లారెడ్డి అంబేడ్కర్ చౌక్ – 2వ బిట్ ఎల్లారెడ్డి మండలం • 503122 • కామారెడ్డి జిల్లా

133.33 గజాల స్థలం అమ్మకానికి!

📐 30 × 40 = 133.33 గజాలు
✓ మంచి లొకేషన్ ✓ నివాసానికి అనుకూలం ✓ పెట్టుబడికి మంచి అవకాశం
📞 90105 06539
🏡 ఇళ్లు & ప్లాట్ల కొనుగోలు • అమ్మకాలు హైదరాబాద్ • నిజామాబాద్ • కామారెడ్డి • మెదక్ • ఎల్లారెడ్డి
పవార్ వార్త

మా తాజా వార్తలను మిస్ కాకండి!

తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.

Yaswanth Pavahar
Yaswanth Pavahar పవార్ వార్త • సైట్ అడ్మిన్ Journalist and Executive Editor at Telangana Pawar Dainapatrika, focused on responsible journalism, public-interest reporting, and highlighting local issues across Telangana.

Leave a Reply