ఎల్లారెడ్డి ఆర్డీఓ ఆధ్వర్యంలో అఖిలపక్ష నేతలు, సర్పంచులతో ఓటర్ల జాబితాపై సమావేశం
ఎల్లారెడ్డి ఆర్డీఓ కార్యాలయంలో సెప్టెంబర్ 2న ఓటర్ల జాబితా సవరణపై ప్రత్యేక సమావేశం జరిగింది. రెవెన్యూ డివిజనల్ అధికారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గ్రామాల సర్పంచులు, రెవెన్యూ శాఖ అధికారులు, ఎన్నికల విభాగం అధికారులు హాజరయ్యారు.
సమావేశంలో No Mapping & Anomalies కేటగిరీలో ఉన్న ఓటర్లకు జారీ చేసిన నోటీసుల పురోగతిని ఆర్డీఓ వివరించారు. నియోజకవర్గంలోని మొత్తం 283 పోలింగ్ కేంద్రాల పరిధిలో 56,460 నోటీసులు జారీ చేయగా, 28,414 నోటీసులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇది 50.33 శాతంగా ఉందని, మరో 28,046 నోటీసులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. ఇప్పటివరకు 4,086 మందికి విచారణ పూర్తికాగా, 7,856 మందికి విచారణ గడువు ముగిసినట్లు తెలిపారు.
మండలాల వారీగా నోటీసుల వివరాలు
02.09.2026 మధ్యాహ్నం 2:30 గంటల నాటికి నమోదైన వివరాల ప్రకారం:
- గాంధారి: 14,381 నోటీసులు జారీ, 4,305 పంపిణీ.
- లింగంపేట: 9,521 నోటీసులు జారీ, 4,439 పంపిణీ — 46.62 శాతం.
- నాగిరెడ్డిపేట: 5,878 నోటీసులు జారీ, 3,369 పంపిణీ — 57.32 శాతం.
- రాజంపేట: 2,316 నోటీసులు జారీ, 2,080 పంపిణీ — 88.09 శాతం.
- రామారెడ్డి: 4,042 నోటీసులు జారీ, 2,260 పంపిణీ — 55.91 శాతం.
- సదాశివనగర్: 7,255 నోటీసులు జారీ, 3,596 పంపిణీ — 49.57 శాతం.
- తాడ్వాయి: 5,330 నోటీసులు జారీ, 2,412 పంపిణీ — 45.25 శాతం.
- ఎల్లారెడ్డి: 3,957 నోటీసులు జారీ, 3,201 పంపిణీ — 80.89 శాతం.
- ఎల్లారెడ్డి మున్సిపాలిటీ: 3,680 నోటీసులు జారీ, 2,752 పంపిణీ — 74.78 శాతం.
మొత్తంగా 283 పోలింగ్ కేంద్రాల పరిధిలో 56,460 నోటీసులు జారీ చేయగా, 28,414 పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. 28,046 నోటీసులు పెండింగ్‌లో ఉండగా, 4,086 విచారణలు పూర్తయ్యాయని, 7,856 మందికి విచారణ గడువు ముగిసిందని వివరించారు.
నోటీసులు అందిన ఓటర్లకు ఆర్డీఓ సూచనలు
నోటీసు అందిన ప్రతి వ్యక్తి హియరింగ్ రోజున తప్పనిసరిగా వ్యక్తిగతంగా లేదా తమ దగ్గరి కుటుంబ సభ్యుల ద్వారా హాజరై పూర్తి సమాచారం అందించాలని ఆర్డీఓ సూచించారు. తప్పుడు సమాచారం ఇవ్వకూడదని, హాజరు కాని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
హియరింగ్‌కు హాజరు కాని ఓటర్ల వివరాలను పై అధికారులకు నివేదిస్తామని పేర్కొన్నారు. తమ ఓటును కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
Form-6, Form-7, Form-8 దరఖాస్తుల వివరాలు
సమావేశంలో Form-6, Form-7, Form-8లకు సంబంధించిన ప్రస్తుత స్థితిని కూడా వివరించారు. ఆగస్టు 17, 2026 నుంచి సెప్టెంబర్ 1, 2026 వరకు కొత్త ఓటు నమోదు కోసం Form-6 కింద 212 దరఖాస్తులు, సవరణల కోసం Form-8 కింద 186 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.
మొత్తం 398 ఫారాల్లో 334 ఇంకా ప్రాసెసింగ్ దశలో ఉన్నాయని, వాటిలో 21 దరఖాస్తులు BLOలకు కేటాయించగా, 34 ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తయినట్లు వివరించారు.
ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులు, సర్పంచులు సహకరించి గ్రామాల్లో అవగాహన కల్పించాలని ఆర్డీఓ కోరారు. నోటీసులు అందిన ప్రతి ఓటరు సంబంధిత విచారణకు హాజరై తమ ఓటును సరిచూసుకోవాలని సూచించారు. అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా చూడడమే లక్ష్యమని తెలిపారు.