గాంధారి మండలం గౌరారం కలాన్ పాఠశాలలో విద్యార్థులకు దుస్తుల పంపిణీ
గాంధారి మండల కేంద్రంలోని గౌరారం కలాన్ జిల్లా పరిషత్, ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు దుస్తుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ సువర్ణ అనిల్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి శ్రీహరి ప్రాథమిక, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు దుస్తులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులందరూ ప్రతిరోజూ పాఠశాలకు హాజరవుతూ నాణ్యమైన విద్యను పొందాలని, పౌష్టికాహారం తీసుకోవాలని సర్పంచ్ సువర్ణ అనిల్ గౌడ్ సూచించారు.
ప్రభుత్వం అందించే పుస్తకాలు, నోట్‌బుక్కులను సక్రమంగా వినియోగించుకోవాలని, పాఠశాలలో నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొనాలని ఉపసర్పంచ్ కృష్ణమూర్తి తెలిపారు. తద్వారా తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడకుండా చూసుకోవాలని సూచించారు.
కార్యక్రమంలో వార్డు సభ్యులు రమేష్, మాధవి సంగమేష్, సావిత్రి రవీందర్, మేకల స్వప్నరమేష్, చాకలి రమేష్, కళ్యాణ్ గౌడ్ పోతరాజు, దత్తు, సాయిరాం, బైరిపోచయ్య, సత్యనారాయణ, ఉపాధ్యాయులు ఉమామహేశ్వర్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాములు, విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.