అటవీ శాఖ అమరవీరులకు నివాళులు అర్పించిన మంత్రి జూపల్లి కృష్ణారావు
జాతీయ అటవీ శాఖ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ బహదూర్‌పురలోని నెహ్రూ జూ పార్కులో శుక్రవారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక, పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అటవీ శాఖ అమరవీరులకు మంత్రి జూపల్లి కృష్ణారావు నివాళులు అర్పించారు. అటవీ శాఖ అధికారులు అందిస్తున్న సేవలను ఆయన కొనియాడారు.
కార్యక్రమంలో డీజీపీ సీవీ ఆనంద్, పీసీసీఎఫ్ (HoFF) వినయ్ కుమార్, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, పీసీసీఎఫ్ (డెవలప్‌మెంట్) రత్నాకర్ జోహరి, టీజీఎఫ్‌డీసీ వీసీ అండ్ ఎండీ సునీతా భగవత్‌తో పాటు ఇతర అటవీ శాఖ అధికారులు, సిబ్బంది, రిటైర్డ్ అధికారులు పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.