పాదయాత్ర భక్తులకు సేవలు అందిస్తున్న పత్లాపూర్ BRS నాయకులు
శ్రావణమాసం సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించే శ్రీ జగద్గురు స్వామి నరేంద్ర చార్య జీ పాదయాత్ర భక్తిశ్రద్ధలతో కొనసాగుతోంది. బిచ్కుంద నుంచి జుక్కల్ మండలంలోని దోసపల్లి నరేంద్ర స్వామి పీఠం వరకు ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నారు.
ఈ పాదయాత్రలో పాల్గొనే భక్తులకు పత్లాపూర్ గ్రామానికి చెందిన BRS నాయకులు గత రెండు సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పాదయాత్ర భక్తులకు చాయ్, బిస్కెట్లు, తాగునీటిని అందిస్తూ తమ వంతు సేవ చేస్తున్నారు.
భక్తి మార్గంలో భక్తులకు సేవ చేయడం ఎంతో ఆనందంగా ఉందని వారు తెలిపారు. పాదయాత్రలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తమ వంతు సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ సేవా కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ అరుణ్, సొసైటీ వైస్ చైర్మన్ యాదరావ్, గ్రామ మాజీ ఉపసర్పంచ్ శివకాంత్ అప్ప, రాజు, నారం సుదర్శన్, ఎడిగి బాలరాజ్, బంటు విఠల్, కప్ప వెంకట్‌తో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.