మోదీ ప్రజా సేవలో 25 ఏళ్లు పూర్తి చేసిన సందర్భంగా కామారెడ్డిలో ‘సేవా సంకల్ప అభియాన్’ జిల్లా కార్యశాల
భారతీయ జనతా పార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ ప్రజా సేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘సేవా సంకల్ప అభియాన్’ జిల్లా కార్యశాలను నిర్వహించారు.
ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలు, భారత ప్రధానిగా 12 సంవత్సరాలు పనిచేసి మొత్తం 25 సంవత్సరాల పాటు ప్రజా సేవకు అంకితమయ్యారని తెలిపారు.
మోదీ సేవా సంకల్పానికి ప్రతీకగా ఆయన జన్మదినమైన సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా ‘సేవా సంకల్ప అభియాన్’ కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ సూచించినట్లు నీలం చిన్న రాజులు తెలిపారు.
అందులో భాగంగా కామారెడ్డి జిల్లాలోని అన్ని మండలాల్లో గ్రామగ్రామాన, బూత్ స్థాయిలో ‘సేవా సంకల్ప అభియాన్’లో భాగంగా సూచించిన కార్యక్రమాలను నిర్వహించాలని ఆయన అన్నారు.