విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి ఆకస్మిక మృతి.. ఇద్దరు పిల్లలకు తండ్రి దూరం
ఇందల్వాయి రెవెన్యూ కార్యాలయ ఉద్యోగి కన్నుమూత
ఇవి కూడా చదవండి
పవార్ వార్త, ఇందల్వాయి: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం గౌరారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో జీపీఓగా విధులు నిర్వహిస్తున్న మీసాల రవీందర్ మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. నడిపేట్ మండలం వన్నెల్ (బి) గ్రామానికి చెందిన ఆయన ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
రవీందర్ మృతి విషయాన్ని కుటుంబ సభ్యులు ఇందల్వాయి తహశీల్దార్ బాలయ్యకు తెలియజేశారు. ఆయన గత 12 నెలలుగా ఇందల్వాయి రెవెన్యూ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నట్లు తహశీల్దార్ వెల్లడించారు.
మీసాల రవీందర్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. సహోద్యోగులు, గ్రామస్తులు కూడా ఆయన మృతిపట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.












