సరికొత్త అవతారంలో గౌతమ్ వాసుదేవ్ మీనన్: ఆకట్టుకుంటున్న ‘డియర్ ఆస్ట్రోనాట్’ ఫస్ట్ లుక్
ప్రముఖ దర్శకుడు మరియు నటుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ‘డియర్ ఆస్ట్రోనాట్’ అనే కొత్త చిత్రంలో ఒక ఆసక్తికరమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కార్తీక్ భాగ్యరాజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో గౌతమ్ మీనన్ ‘ఏవియేషన్ చీఫ్ డేవిడ్ థామస్’ అనే పవర్‌ఫుల్ పాత్రను పోషిస్తున్నారు.
తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌లో ఆయన ఏవియేషన్ యూనిఫాంలో చాలా గంభీరంగా కనిపిస్తూ సినిమాపై అంచనాలను పెంచుతున్నారు. మనస్విని భాగ్యరాజ సమర్పిస్తున్న ఈ విభిన్నమైన చిత్రానికి కార్తీక్ కొడకండ్ల సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2026 అక్టోబర్ నెలలో థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.