ఎల్లారెడ్డిలో శివపార్వతి గణేష్ మండలి ఆధ్వర్యంలో అన్న ప్రసాదం
ఎల్లారెడ్డి, కామారెడ్డి జిల్లా
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో శివపార్వతి గణేష్ మండలి ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు అన్న ప్రసాదం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ జీవన్, సొసైటీ వైస్ చైర్మన్ ప్రశాంత్ గౌడ్, విద్యాసాగర్, పల్యాల రాములు తదితరులు పాల్గొన్నారు. గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు అన్న ప్రసాదాన్ని అందించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తుల సహకారంతో అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, గణేష్ మండలి సభ్యులు భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలు విజయవంతంగా కొనసాగేందుకు స్థానికులు, భక్తులు సహకరిస్తున్నారు.
133.33 గజాల స్థలం అమ్మకానికి!
మా తాజా వార్తలను మిస్ కాకండి!
తెలంగాణ తాజా వార్తలు నేరుగా మీ మొబైల్‌లో పొందండి.